Bank account freeze news: ఎన్నికలు సమీపిస్తున్నవేళ నెల్లూరు మాజీమంత్రి టీడీపీ నేత నారాయణకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు పోలీసులు ఆయా బ్యాంకులకు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్టు తెలుస్తోంది.
మార్చి నాలుగున నెల్లూరు టీడీపీ నగర అభ్యర్థి నారాయణ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో దాదాపు కోటి 81 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పునీత్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. నారాయణ విద్యాసంస్థలతో ఎన్‌స్పిరా చేసుకున్న ఒప్పందం ప్రకారం 20 కోట్ల మేరా వాహనాలను కొనుగోలు చేశారు. ఇన్వాయిస్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో తీసుకోవడంతోపాటు ఆ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడంతో అవకతవకలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read: రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్.. చంద్రబాబు
దీనిపై నెల్లూరు జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదేరోజు తొమ్మిది ఖాతాలను స్తంభింపచేశారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డరు తెచ్చుకున్నారు. అయితే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి మరో నాలుగు ఖాతాలను నిలుపుద చేయాలని బ్యాంకు అధికారులకు నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో వాటిని ఫ్రీజ్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఎన్‌స్పిరా సంస్థ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి సేవలు అందిస్తోంది. ఆ సంస్థకు నారాయణ అల్లుడు పునీత్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే నారాయణ సంస్థకూ ఆయనే డైరెక్టర్. మరోవైపు మద్దతుదారులు మాత్రం ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తోందని మండిపడుతున్నారు.