Big Stories

Mumbai Indians Captaincy: రోహిత్ తో మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. నెట్టింట్లో వీడియో వైరల్!

 Rohit Sharma - Akash Ambani

- Advertisement -

Rohit Sharma Talking With Akash Ambani about MI Captaincy: ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో కెప్టెన్సీపై పెద్ద చర్చ జరుగుతోంది.  ఇతర ఫ్రాంచైజీలకు-ముంబై ఇండియన్స్ కి కొంచెం వ్యత్యాసం ఉంది. మిగిలిన వాటిపై ఆడటం గెలవడమే తప్ప, ప్రెస్టేజ్ అనేది ఉండదు. కానీ ముంబై జట్టుకి ఉన్న బ్రాండ్, ఆ బ్యాగ్రౌండ్ ఇవన్నీ ప్రతీ ప్లేయర్ పైన పనిచేస్తుంటాయి.

- Advertisement -

ఇంక కెప్టెన్లకి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా తనకు తెలియకుండానే, ఆ భారాన్ని ఫీలవుతున్నాడని అంటున్నారు. అంతేకాకుండా రోహిత్ శర్మ ఫ్యాన్స్ తాకిడి కూడా అతని సహజ సిద్దమైన ఆటతీరుని ప్రభావితం చేస్తోందని అంటున్నారు. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు సహజసిద్ధమైన ఆటని కోరుకుంటారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో ఓటమి అనంతరం ముంబై ఫ్రాంచైజీ ఓనర్లు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ ఇద్దరూ కూడా వెళ్లి రోహిత్ శర్మను ప్రత్యేకంగా కలిసి మాట్లాడినట్టు సమాచారం. ఇప్పుడీ వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో రోహిత్ శర్మతో డైరక్టుగా ఆకాశ్ అంబానీ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.

Also Read: స్టబ్స్, వార్నర్ పోరాటం వృథా.. ఢిల్లీతో పోరులో రాజస్థాన్ విజయం..

నిజానికి ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ముంబై ఇండియన్స్ ఒక చెత్త రికార్డు మూట కట్టుకుంది. ఐపీఎల్ లో అత్యధికంగా 277 పరుగులు ఒక జట్టుకి సమర్పించుకోవడం నిజంగా దారుణమనే అంటున్నారు. ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా సరే, ప్రత్యర్థులను ఆ మాత్రం నిలువరించలేరా? అని నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తుంది.

హైదరాబాద్ లాంటి జట్టు చితక్కొట్టేయడాన్ని ముంబై యాజమాన్యం జీర్ణించుకోలేక పోతోంది. అయితే ముంబయి బ్యాటర్లు కూడా గట్టిగానే ఆడారు. వాళ్లు 246 పరుగులు చేశారు. ఇది కూడా చిన్నవిషయం కాదు. దీనిని ఇప్పుడెవరూ పరగిణలోకి తీసుకోవడం లేదు.

ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా 2 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. షమ్స్ ములానీ 2 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. మఫాకా 4 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News