E-Paper
Advertisement

Tillu Square Twitter Review: ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. 3/5 రేటింగ్.. కానీ అదొక్కటే..?

Tillu Square Twitter Review: ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. 3/5 రేటింగ్.. కానీ అదొక్కటే..?
Advertisement
siddu jonnalagadda tillu square movie
Tillu Square Movie Twitter Review

Siddu Jonnalagadda & Anupama Parameswaran starring Tillu Square Twitter Review: ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయిందంటే దానికి కొనసాగింపుగా ఎలాంటి సీక్వెల్స్ ఉండేవి కాదు. కానీ ఈ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు సీక్వెల్స్ రెడీ అయిపోతున్నాయి. అంతేకాకుండా.. హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అది స్టార్ హీరో సినిమా అయినా మిడిల్ రేంజ్ హీరో సినిమా అయినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు.

అయితే అలాంటిదే ఇప్పుడు మరో సీక్వెల్ మూవీ రిలీజ్ అయింది. గతంలో థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులతో ఈళలు వేయించిన ‘డీజే టిల్లు’ మూవీకి సీక్వెల్‌ అయిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఈ రోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

Advertisement

ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఈ మూవీ నేడు రిలీజ్ కావడంతో పలువురు ట్విట్టర్ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : టిల్లుకు, నాకు మధ్య ఉన్న తేడా అదే.. ?

Advertisement

ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న సినీ ప్రియులు ఈ మూవీపై రివ్యూ ఇస్తున్నారు. అందులో ఓ నెటిజన్.. టిల్లు స్క్వేర్ మూవీ చాలా ఫన్‌గా ఉందని.. సిద్దు పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ‘డీజే టిల్లు’లో రాధికగా అలరించిన నేహాశెట్టి ఎంట్రీ సీన్ అందరినీ సర్ప్రైజ్‌కు గురి చేసిందని రాసుకొచ్చాడు.

అలాగే మరొకరు రాస్తూ.. టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని అన్నారు. అయితే సిద్దు మాత్రం తన ఎనర్జిటిక్ అవతార్‌లో దుమ్ము దులిపేశాడని ఈ మూవీని సిద్దు తన భుజాలపై మోశాడని అంటున్నారు.

అయితే కొన్ని కామెడీ సీన్లు కాస్త ఇబ్బందిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో సర్ప్రైజ్ అదిరిపోయిందని.. ఈ ట్విస్ట్‌తో సెకండ్ పార్ట్‌పై ఆసక్తి కలిగించారని రాసుకొచ్చాడు. టిల్లు స్క్వేర్ మూవీ కామెడీని పంచే ఒక రోలర్ కోస్టర్.. ఇందులో సిద్దు తన పెర్ఫామెన్స్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు.

Also Read :  తలైవర్ తో లోకేష్.. విక్రమ్ ను మించి ఉండాలి రాజా

అనుపమ కూడా అద్భుతంగా నటించింది. వన్ టైమ్ వాచ్ అంటూ 3/5 రేటింగ్ ఇస్తూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. మొత్తానికి సిద్దుగాని ‘టిల్లు స్క్వేర్’ మంచి హిట్ అందుకుందని మరికొంత మంది ట్వీట్లవర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా సినిమా చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.

https://twitter.com/Swathi_Prasad96/status/1773521993444303343?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×