BigTV English

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Duvvada – Madhuri: ఆ జంట ఏది చేసినా, మాట్లాడినా వైరల్ కావాల్సిందే. సోషల్ మీడియాలో వీరికి ఉండే, క్రేజ్ అటువంటిది మరి. అటువంటి జంట దీపావళి రోజు.. ఒకరి చేయి ఒకరు పట్టుకొని దీపాలు వెలిగించారు. టపాసులు కాల్చారు. ఆ జంట ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. దీపావళి రోజు ఆనందంగా దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన ఆ జంట ఏమి చెప్పారంటే?


టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అంటే తెలియని వారు ఉండరు. ఇక పొలిటికల్ లీడర్ గా దువ్వాడకు ఎంత గుర్తింపు ఉందో.. అదే గుర్తింపు సోషల్ మీడియాలో మాధురికి ఉంది. ఇక ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ వివాద సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. అయితే ఒకరికి ఒకరు తోడుగా మాత్రమే ఉంటున్నామని, తమ మధ్య ఉన్న బంధాన్ని చెడుగా అనుకోవద్దు అంటూ పలుమార్లు మీడియాతో మాధురి అన్నారు.

అయితే దువ్వాడ వివాదం సమయంలో మాధురి అండదండగా ఉన్నారు. దీనితో వీరి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా కోడై కూసింది. ఏదిఏమైనా వీరివురు న్యాయపరమైన చిక్కులు వీడిన అనంతరం ఒక్కటవుతారని అందరూ భావించారు. ఇటీవల దువ్వాడకు సంబంధించిన కుటుంబ వివాదం కొంత సద్దుమణిగిన స్థితిలో.. మాధురి సోషల్ మీడియాలో స్పీడ్ అయ్యారనే చెప్పవచ్చు. ఈమెకు సోషల్ మీడియా పరంగా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే ఈమెకు సంబంధించిన ప్రతి వీడియో వైరల్ కావాల్సిందే.


తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. అక్కడ మాధురి మాట్లాడుతూ.. కోర్టులో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే.. తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఆ సమయంలోనే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో రీల్స్ చేసినట్లు, అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా మాధురి మాట్లాడినట్లు ఆరోపిస్తూ టీటీడీ విజిలెన్స్ అధికారులు, తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు తాజాగా 41ఏ నోటీసులు జారీ చేశారు.

Also Read: Breaking news: కుశ్నపల్లిలో టెన్షన్.. టెన్షన్.. వెనక్కు తగ్గిన అఘోరి.. చివరకు?

ఇది ఇలా ఉంటే టెక్కలి లోని తమ నివాసంలో ఈ జంట ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. కొత్త ఇంటిని లైటింగ్ తో అందంగా అలంకరించారు వీరు. కొత్త ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటి ఆవరణంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురీలు ప్రమిదలను వెలిగించారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలంటూ లక్ష్మీదేవికి పూజ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్, మాధురి తెలిపారు. అలాగే అందరి జీవితాల్లో కమ్ముకొన్న చీకటి తొలగి, వెలుగులను ఆ దేవదేవుడు ప్రసాదించాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద దీపావళి సంధర్భంగా దువ్వాడ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×