Big Stories

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌..తాట తీస్తారా? క్లియర్ కట్

Telegraph Act On Phone Tapping Case

- Advertisement -

Telegraph Act On Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్.. బీఆర్ఎస్‌ నేతల డైరెక్షన్‌లో జోరుగా సాగింది ట్యాపింగ్.. ఇది మేము చెబుతున్న మాట కాదు. అటు విపక్షాలు.. ఇటు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్న మాటలు. ఇప్పటికే కొంతమంది నిందితులు చిక్కారు..
మరికొందరు అతి త్వరలో చిక్కబోతున్నారు. అయితే ట్యాపింగ్‌ చిట్టా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇంతలోనే ట్యాపింగ్ చేసిన అధికారులపై టెలిగ్రాఫ్‌ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇంతకీ ఏంటి టెలిగ్రాఫ్‌ యాక్ట్.. ఈ చట్టం కింద నేరం నిరూపితమైతే ఏం జరుగుతోంది?

- Advertisement -

టెలిగ్రాఫ్‌.. 1837లో ఇన్వెంట్ చేశారు. అలా అలా డెవలప్ చేస్తూ 1865లో ఓ ఫైనల్ ఔట్‌పుట్‌ను తీసుకొచ్చారు. ఈ ఇన్‌స్ట్ర్‌మెంట్‌ కనిపెట్టిన అతి కొన్ని రోజులకే.. దీనిపై ఓ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే మన దగ్గర కాదు.. అమెరికాలో.. 1890లో న్యూయార్క్‌లో ఈ యాక్ట్‌ తెరపైకి వచ్చింది. ఇక 1910లో న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ఎలాంటి వారెంట్ లేకుండా.. హోటల్స్‌ ఫోన్స్‌ను వైర్‌ట్యాప్‌ చేశారని గుర్తించారు. అప్పట్లో అంటే 1885లో బ్రిటిష్‌ గవర్నమెంట్‌ కూడా.. అప్పటికే ఇందులో టెలిఫోన్స్‌ను కూడా చేర్చి.. ఇండియాలో ఈ యాక్ట్‌ను తీసుకొచ్చింది.

Also Read: రాజు గారి పంతం..! తగ్గేనా..? నెగ్గేనా..?

మరి ఈ చట్టం ప్రకారం ట్యాప్‌ చేయడం నేరమా? దానికి శిక్ష అనుభవించాల్సిందేనా? అంటే నో అనే ఆన్సర్ చెప్పాలి. ట్యాపింగ్ చేయవచ్చు. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా కఠినమైవని.. ఈ యాక్ట్‌లోని సెక్షన్‌ ఫైవ్‌లో ఎవరి ఫోన్స్‌ ట్యాప్‌ చేయవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ట్యాప్ చేయవచ్చో ఎక్స్‌ప్లేన్ చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితేనో.. ప్రజల రక్షణ కోసమైతేనో.. లేదంటే దేశానికి లేదా రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు. ఇతర దేశాలతో సంబంధాలు ముప్పులో ఉన్నాయని భావించినప్పుడు ట్యాపింగ్ చేయవచ్చు.

అయితే ముందుగా స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్‌.. లేదా సెంట్రల్‌ గవర్నమెంట్‌ అండర్‌లో నడిచే ఏదైనా ఏజెన్సీ.. లైక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్..ఇలా కొన్ని ఏజెన్సీలు ట్యాపింగ్ చేయవచ్చు.. అవి కూడా ఫస్ట్‌ పర్మిషన్ తీసుకోవాలి.. అలా తీసుకొని కూడా కొద్ది సమయం మాత్రమే.. అంటే ఆ థ్రెట్‌ ముగిసే వరకు మాత్రమే ట్యాపింగ్‌ చేసుకోవచ్చు.. అలా ట్యాప్‌ చేసిన రికార్డులను కూడా ఫ్యూచర్‌ రిఫరెన్స్‌ కోసం భద్రపరచాలి.. వాటిని నాశనం చేయకూడదు. ఇదీ చట్టం చెబుతున్నది.

మరీ రూల్స్‌ను అతిక్రమిస్తే.. అధికారం ఉంది కదా అని మిస్‌ యూస్‌ చేస్తే.. దీనికి సంబంధించిన ప్రొవిజన్‌ను కూడా యాక్ట్‌లో పెట్టారు. ఇదే యాక్ట్‌లో సెక్షన్ 26లో అనుమతి లేకుండా ట్యాప్‌ చేస్తే.. ఎలాంటి శిక్షలు విధించవచ్చో తెలిపారు. ఇండివ్యూజల్‌ పర్సన్ ప్రైవసీకి ఇబ్బందికలిగించేలా.. కావాలనే కేంద్ర ప్రభుత్వం, కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ప్రభుత్వాధికారి కానీ ట్యాపింగ్ చేసినా.. వారి మెసేజ్‌లను హ్యాక్ చేసినా.. మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని చెబుతోంది ఈ చట్టం.

దేశంలో ఇలాంటి కేసులు ఇంతకుముందు నమోదు కాలేదా? అంటే అయ్యాయి. ముఖేష్‌ కుమార్‌ కౌశిక్‌ వర్సెస్‌ ఢిల్లీ స్టేట్‌ ఇండస్ట్రియల్.. ధరమ్‌బీర్‌ వర్సెస్‌ సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌.. ఈ రెండు కేసుల్లో అటు ప్రభుత్వాధికారులు, ఇటు సీబీఐ అధికారులు.. తమ ఫోన్‌ ట్యాప్‌ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన సరైన ఆధారాలు మాత్రం లేవు..

ఇది టెలిగ్రాఫ్‌ చట్టం.. దానికి సంబంధించిన డిటెయిల్స్.. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వద్దాం.. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి. ఇప్పుడు రాధాకిషన్‌ రావు, ప్రణీత్‌ రావు, భుజంగరావు.. తిరుపతన్నలపై ఇప్పుడు ఇదే యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. వీరు చేసిన ట్యాపింగ్‌ దేశభద్రతకు సంబంధించినదా..? కాదు.. ప్రజల రక్షణ కోసం ట్యాపింగ్ చేశారా.. ? లేదు. పోనీ ట్యాపింగ్ చేసి రాబట్టిన ఇన్ఫర్మేషన్‌తో ప్రజలకు ఏమైనా ఒరిగిందా? లేదు. ఇవన్నీ కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పర్మిషన్స్‌ తీసుకున్నారా.. అంటే అదీ లేదు. అందుకే ఈ చట్టం కింద ఇప్పుడు కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also Read: సాగర్ ఏదైనా దోచుడే.. ట్రబుల్ మేకర్‌

అయితే దేశవ్యాప్తంగా ట్యాపింగ్ ఆరోపణలు ఎన్ని ఉన్నా కానీ.. ఎప్పుడూ కూడా ఈ చట్టం కింద కేసులు నమోదు కాలేదు. రీజన్.. సరైన ఆధారాలు ఉండవు.. కేసు కోర్టుకు వెళ్లినా ప్రూవ్‌ చేయడం కష్టం.. అందుకే ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు. కానీ తెలంగాణలో సీన్‌ మాత్రం వేరు.. ట్యాపింగ్‌ చేశారన్న ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నిందితుల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్స్‌ కూడా ఉన్నాయి. అప్పటి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దర్యాప్తు అధికారులు దీనికి తోడు తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయి అంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులున్నాయి. సో కేసును ప్రూవ్‌ చేయడం చాలా ఈజీ.. ఈ ఆలోచనతోనే.. టెలిగ్రాఫ్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు..

నిజానికి ట్యాపింగ్‌ వ్యవహారంలో అసలు డొంకను కదిలించే పనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు పోలీసులు.. ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్-1885ను యాడ్ చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో కూడా ఇచ్చేశారు.. సో ఇప్పుడు కేసు సీరియస్‌ నెస్ మరింత పెరిగింది. ఒక్కసారి ఈ కేసులో అధికారులు కన్విక్ట్ అయితే.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడమే కాదు. మూడేళ్లపాటు జైల్లోనే మగ్గిపోనున్నారు.

ఇదే కాదు ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్షన్ 69 కూడా.. ట్యాపింగ్‌కు సంబంధించి కీలక విషయాలను చెబుతోంది. కాల్స్‌ను రికార్డు చేయ‌డానికి లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి.. కేంద్ర హోం శాఖ కార్యద‌ర్శి, రాష్ట్ర హోం శాఖ కార్యద‌ర్శి పర్మిషన్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చట్టాలు ఇన్ని రూల్స్ చెబుతుంటే.. తెలంగాణలో మాత్రం విచ్చలవిడిగా.. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు.. ట్యాపింగ్‌లు చేసి ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల చుట్టు తిరుగుతున్నారు అధికారులు.

 

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News