Big Stories

Harish Rao Scams : సాగర్ ఏదైనా దోచుడే.. ట్రబుల్ మేకర్‌

harish rao
 

Harish Rao Scams Latest News: ట్రబుల్‌ షూటర్ .. పాలిటిక్స్‌లో, మీడియాలో ఆయనకున్న పేరు. ట్రబుల్ మేకర్‌.. సిద్ధిపేటకు వెళ్తే వినిపించే పేరు. పాలిటిక్స్‌లో ట్రబుల్స్‌కు చెక్ పెడతాడని పేరున్న వ్యక్తి. రైతుల పాలిట ట్రబుల్‌ మేకర్‌గా మారాడు. రంగనాయకమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌ మాటున.. హరీష్‌రావు చేసిన అక్రమాల చిట్టాను.. క్రిస్టల్ క్లియర్‌ క్లారిటీతో పిన్‌ పాయింట్‌ డిటెయిల్స్‌తో.. బిగ్‌ టీవీ ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్‌గా టెలికాస్ట్ చేసింది. కానీ కథ అక్కడితో ఆగిందా? హరీష్‌రావు చేసిన అక్రమాలు ఇవేనా? ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్ నో.. తెలిసింది కొంతే.. తెలియాల్సింది కొండంత ఉందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం.

- Advertisement -

హరీష్‌రావు.. బీఆర్ఎస్‌ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు. ఓ రకంగా చెప్పాలంటే నెంబర్ త్రీ.. ఆయన వాగ్ధాటికి.. ప్రశ్నల పరంపరకు ఫ్యాన్స్‌ ఉన్నారు. కానీ ఆ వాగ్ధాటి మాటున దాగిఉన్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు.. ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. రంగనాయకసాగర్‌ భూసేకరణ పేరుతో కొట్టేసిన భూమిని ఫామ్‌ హౌస్‌గా ఎలా మార్చుకున్నాడో ఇప్పటికే కళ్లకు కట్టినట్టు చూపించాము. కానీ ఒక్క రంగనాయకసాగర్‌లో మాత్రమే కాదు. సిద్ధిపేటను తన అడ్డాగా మార్చుకొని హరీష్‌రావు ఇంకా చాలానే అక్రమాలు చేసినట్టు..ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి..

- Advertisement -

రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌..ఇలా సాగర్ ఏదైనా ప్రజల పొట్ట కొట్టారు హరీష్‌రావు.. ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకొని.. సొంత ప్రయోజనాలు తీర్చుకున్నారు. కేసీఆర్‌ మానసపుత్రికైన ధరణిని అడ్డుపెట్టుకొని రికార్డులు మార్చేశారు. లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. కానీ నిజం నిప్పులాంటిది కదా.. ఎప్పటికైనా చేసిన తప్పు బయటికి రాక తప్పదు.

Also Read: కాంగ్రెస్ ఎత్తుగడలకు బీఆర్ఎస్ చిత్తుచిత్తే

ఈ సాగర్‌లు మాత్రమే కాదు. హరీష్‌రావు సొంతగ్రామం తోటపల్లిలో కూడా ఇలాంటి అక్రమమే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని భూసేకరణ చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌కు కేసీఆర్‌ చేతులు మీదుగా భూమిపూజ కూడా చేశారు. కానీ ప్రాజెక్ట్‌ క్యాన్సలైంది.. నిర్మాణం అటకెక్కింది. మరి రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలి కదా.. కానీ అలా జరగలేదు. ఏళ్లు గడుస్తున్నా భూములు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ భూములు ఇప్పుడు ఎవరి పేరుపై ఉన్నాయి? నేతలు, అధికారులు కలిసి పంచేసుకున్నారా? అందుకే భూములు రైతులకు తిరిగి ఇవ్వడం లేదా? ఇప్పుడీ అనుమానాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ లెక్కలు కూడా తెరపైకి రానున్నాయి..

ఇవే కాదు సిద్ధిపేటలోని కోమటిచెరువు విషయంలో కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిచెరువు పరిసరాల్లోని భూములు కూడా హరీష్‌రావు, ఆయన అనుచరుల పేరు మీదకు మారినట్టు. అనుమానాలు వస్తున్నాయి.. సిద్ధిపేట కలెక్టరేట్‌ కూడా ఊరవతల ఎక్కడో నిర్మించడంపై కూడా..ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు మెడికల్ కాలేజీ కోసం సేకరించిన భూముల్లో కూడా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఒక్క రంగనాయకసాగర్‌ మాత్రమే కాదు. బీఆర్ఎస్‌ హయాంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది. మరి ఆ సమయంలో ముందుగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారా? యజమానుల ఆమోదం లేకుండా భూములు ఎలా తీసుకుంటారు? పోనీ తీసుకున్న భూములకైనా సరైన ధర ఇచ్చారా? అయినవాళ్లకో ఒక రేటు.. కానివాళ్లకు మరో రేటు ఎందుకివ్వాల్సి వచ్చింది? 2013 భూ సేకరణ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అక్రమంగా 123 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? బలవంతంగా ఎందుకు భూములు లాక్కున్నారు? ప్రాజెక్టులు కట్టగా మిగిలిన భూములు లీడర్ల చేతికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఈరోజు సాక్ష్యాధారాలతో బిగ్ టీవీ బయటపెట్టింది అంతే.. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానులే.. ఇప్పుడు హరీష్‌రావుతో పాటు ప్రభుత్వాధికారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.

Also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. దేశంలో తొలి కేసుగా గుర్తింపు

హరీష్‌రావు అడుగులకు మడుగులొత్తిన ప్రభుత్వాధికారులను గుర్తించాలి. హరీష్‌రావుతో పాటు వారిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. తిన్నదంతా కక్కించాలి.. రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడివే డిమాండ్లు సిద్ధిపేటలో వినిపిస్తున్నాయి. ఇలా రైతులను నిండా ముంచిన ఇదే హరీష్‌రావు. ఇప్పుడు రైతు సమస్యలంటూ పోరాడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయంటూ శోకాలు పెడుతున్నారు. రైతుకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన చెందుతున్నారు..

ప్రాజెక్టులకే కాదు.. బీఆర్ఎస్‌ హయాంలో ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌లను నిర్మించారు. అయితే స్థలాల ఎంపిక వెనక కూడా స్వప్రయోజనాలను చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలాలను రియల్ఎస్టేట్‌ సంస్థలకు లాభం చేకూరేలా సెలెక్ట్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వ పాలసీలపై ఫోకస్ చేయాల్సిన టైమ్ వచ్చింది. ప్రజల సంక్షేమమే తమ బాధ్యతగా భావించి మాకున్న వనరులను ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే ఇన్ని భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి ప్రభుత్వం ఫోకస్ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. వాటికి చెక్ చెప్పి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సర్కార్‌ దే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News