Big Stories

IPL 2024 – KL Rahul: కేఎల్ రాహుల్ తప్పుకున్నాడా? తప్పించారా?

IPL 2024

- Advertisement -

IPL 2024- Why Pooran Replaced K L Rahul As LSG captain vs Punjab: ఏం ఐపీఎల్ మ్యాచ్ లు, ఏం ఫ్రాంచైజీలు, కెప్టెన్లతో ఇలా ఆడుకుంటున్నాయి. మొదట ముంబై ఇండియన్స్ మొదలెట్టింది…అయితే ప్రమాదాన్ని ముందే ఊహించిన ధోనీ, ఎందుకైనా మంచిది, గౌరవంగా తప్పుకోవడం మంచిదని అనుకున్నాడో ఏమో, తనంతట తనే తప్పుకున్నాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ వంతు వచ్చింది.

- Advertisement -

తాజాగా పంజాబ్ కింగ్స్ తో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా రావల్సిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో స్టేడియం అంతా ఒక్కసారి షాక్.. ఏమైంది.. రాహుల్ భయ్.. క్యాహోగయా అంటూ నెట్టిల్లు హోరెత్తి పోయింది. రాహుల్ స్థానంలో లక్నో జట్టు పగ్గాలను నికోలస్ పూరన్ అందుకున్నాడు. ఎందుకిలా జరిగింది? అనే అంశంపై స్పష్టత రాలేదు.

టాస్ కోసం వచ్చిన నయా కెప్టెన్ నికోలస్ తనే రాహుల్ విషయాలను చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌పై పనిభారం తగ్గించాలని ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుందని తెలిపాడు.

Also Read: ధావన్ పోరాటం వృథా.. లక్నో బోణీ..

నెట్టింట్లో మనోళ్లు ఊరుకుంటారా? మొత్తం ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. కేఎల్ రాహుల్ తనంతట తనే తప్పుకున్నాడా? లేక ఫ్రాంచైజీ తప్పించిందా? అనే చర్చ జోరుగానే సాగుతోంది. ఫిట్ నెస్ లేకుండానే ఐపీఎల్ కి వచ్చాడా? అలాగైతే ఎన్సీఏ ఎలా సర్టిఫై చేసింది? అని కొందరు అనుమాానాలు వ్యక్తం చేస్తున్నారు. టీ 20 ప్రపంచ కప్ కోసం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కొందరు అంటున్నారు.

ఇంతకుముందే బీసీసీఐ కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పింది. ఐపీఎల్ లో వికెట్ కీపింగ్ చేయవద్దని సలహా చెప్పింది. కేవలం ఫుల్ టైం బ్యాటర్ గా రావాలని తెలిపింది. కానీ రాహుల్ వినలేదు. అందువల్ల ఏమైనా గాయం తిరగబెట్టిందా? అని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంపాక్ట్ ప్లేయర్ గానే జట్టులో ఉన్నాడు. రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చునని అంటున్నారు.

2023 ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ గాయపడి కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. తర్వాత ఆసియాకప్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్నాడు.

కానీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తిరిగి గాయపడ్డాడు. తొలి టెస్టు అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లోనే పునరాగమనం చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News