Big Stories

Skin Care: బాడీ లోషన్లు ఇష్టానుసారంగా వాడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..

Skin Care: అమ్మాయిలకు మేకప్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. మేకప్ తో పాటు స్కిన్ కేర్ పై కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంటారు. తరచూ మారుతున్న కాలం, వాతావరణం దృష్ట్యా చర్మం చాలా రకాలుగా ప్రభావితం అవుతుంది. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకునేందుకు స్కిన్ కేర్ తప్పక పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాలుష్యం కారణంగా బయటికి వెళితే దుమ్ము, ధూళి వంటి వాటికి చర్మం డ్యామేజ్ అవుతుంటుంది. అందువల్ల చర్మాన్ని రక్షించుకోడానికి రకరకాల స్కిన్ కేర్ ప్రాడక్ట్ వాడుతుంటారు.

- Advertisement -

అందులో ముఖ్యంగా బాడీ లోషన్ అనేది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. చర్మంపై పగుళ్లు ఏర్పడకుంగా, మృదువుగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఇది తెలిసిన చాలా మంది బాడీ లోషన్లను ఇష్టానుసారంగా వాడేస్తుంటారు. ఎంత పడితే అంత బాడీ మొత్తం పూసేస్తుంటారు. అయితే ఇలా ఇష్టానుసారంగా బాడీ లోషన్లను వాడడం వల్ల చర్మం దెబ్బతింటుందని అంటున్నారు. ముఖ్యంగా తరచూ ఒకే రకమైన లోషన్ వాడడం వల్ల కూడా చర్మం ప్రభావితం అవుతుందట.

- Advertisement -

తరచూ ఒకే రకమైన లోషన్లు వాడకుండా కాలానికి అనుగుణంగా ఉండే క్రీమ్స్ లేదా లోషన్స్ వాడడం చర్మ ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే చర్మానికి చాలా రకాల సమస్యలు ఎర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులే కాకుండా సాధారణంగా కూడా లోషన్స్ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి.

ముఖ్యంగా స్విమ్మింగ్, వ్యాయామం చేస్తున్న సమయంలో ముందు లేదా తర్వాత వాడే లోషన్లు చర్మానికి హాని కలిగిస్తాయి. ఎందుకంటే వ్యాయామం చేసిన అనంతరం చెమట బయటకు వెళ్లడం వల్ల చర్మం పొడి బారుతుంది. అందువల్ల బాడీకి తగిన లోషన్లు వాడడం మంచిది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు కూడా క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. వర్షాకాలంలోను బయటికి వెళ్లే సమయంలో తేమకు చర్మం జిడ్డుగా మారుతుంది. అందువల్ల కాలానికి అనుగుణంగా ఉండే లోషన్లు వాడడం మంచిది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News