E-Paper
Advertisement

Ka Movie: అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది

Ka Movie: అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది
Advertisement

Ka Movie: యంగ్ హీరో  కిరణ్ అబ్బవరం గురించి తెలుగు  ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన  అవసరం లేదు.  విజయాపజయాలను కానీ, విమర్శలను కానీ పట్టించుకోకుండా  ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కిరణ్ చాలా కష్టాలు పడుతున్నాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన ఈ కుర్ర హీరో.. ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏడాది పాటు గ్యాప్ తీసుకొని ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా  సందీప్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క. ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన  నయన్ సారిక, తన్వీ రామ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్  మంచి ప్రేక్షకాదరణను చూరగొన్నాయి. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కిన  క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్  దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల నుంచి చెప్పుకొచ్చారు.

Advertisement

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

మొదట ఈ రోజు సాయంత్రం అని చెప్పారు. కానీ, కొద్దిగా లేట్ అవుతుందని, రాత్రికి  రిలీజ్ చేస్తామని తెలిపారు. సరే పాన్ ఇండియా సినిమా కదా.. కొత్త కథ అంటున్నారు. ట్రైలర్ వస్తే చూడొచ్చు, ఒక హైప్ ఇవ్వొచ్చు అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ చావుకబురు చల్లగా చెప్పినట్లు .. ఈరోజు ట్రైలర్ రిలీజ్ కావడం లేదని చెప్పుకొచ్చారు. కొన్ని టెక్నీకల్ కారణాల  వలన క ట్రైలర్ రావడం ఆలస్యం అయ్యిందని, రేపు ఉదయం 10. 05 నిమిషాలకు క మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దీంతో ఉదయం నుంచి ఎదురుచూసిన అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

Advertisement

అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది అని కొందరు.. రెండు రోజుల నుంచి ఊదరగొడుతున్నారు.. ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ లో భాగమా.. ?  అని ఇంకొందరు  కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం  ఒక్కడే ఈ సినిమా ప్రమోషన్స్ ను నెత్తిమీద వేసుకున్నాడు. అదే అంతంత మాత్రంగా నడుస్తోంది.

Suriya: నా రక్తం మీ రక్తం వేరు వేరా..స్టేజిపైన కన్నీళ్లు పెట్టుకున్న సూర్య

ఇక ఇప్పుడు ఈ ఆలస్యాలు.. దీనివలన సినిమాపై ఉన్న కొద్దిపాటి  ఆసక్తి పోయేలా ఉందని అంటున్నారు. మరి ఇలాంటివి జరగకుండా రేపు అయినా అనుకున్న టైమ్ కు ట్రైలర్ రిలీజ్ చేసి, ప్రమోషన్స్ లో కూడా హైప్ తీసుకొస్తే.. క మూవీ కొంతవరకు పాజిటివ్ టాక్ ను తెచ్చుకొనే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో  ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×