BigTV English
Advertisement

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Salman Black Buck Case: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింకల వేట కేసు చిక్కులు ఇప్పట్లో తప్పేలా లేవు. న్యాయస్థానం ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చి 5 ఏళ్లు జైలు శిక్ష విధించగా, కొద్ది రోజులు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయనకు అసలు తలనొప్పులు జైలు నుంచి బయటకు వచ్చాకే మొదలయ్యాయి. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చంపేస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తమ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణ జింకలను చంపిన సల్మాన్ కు బతికే అర్హత లేదని తేల్చి చెప్పారు. ఎప్పటికైనా ఆయన ప్రాణం తీసి తీరుతామని  హెచ్చరించారు.


మాటలు చెప్పడమే కాదు, పలుమార్లు సల్మాన్ పై హత్యాయత్నం ప్రయత్నాలు జరిగాయి. రీసెంట్ గా ముంబైలోని సల్మాన్ నివాసం ముందు లారెన్స్ గ్యాంగ్ కాల్పులు జరపడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్, ముంబైలో ఎన్సీపీ నేతల సిద్ధిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ను చంపుతామంటూ ముంబై పోలీసులకు మెసేజ్ రావడంతో ఖాకీలు అప్రమత్తం అయ్యారు. సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం చేశారు.

అసలు ఇంతకీ కృష్ణ జింకల కేసు కథేంటి?


1998లో సల్మాన్ ఖాన్ హీరోగా ‘హమ్ హమ్ సాథ్ సాథ్’ అనే సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్‌ జోధ్‌ పూర్‌ జిల్లాకు వెళ్లారు. కంకణి గ్రామంలో షూటింగ్ చేశారు. ఆ టైమ్ లో  సల్మాన్ ఖాన్ తో పాటు నటుడు సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే దివంగత రాజేష్ పైలెట్ కొడుకు దుష్యంత్ సింగ్, డ్రైవర్ సతీష్ షా ఉన్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు. ఆ సమయంలో సల్మాన్ తో పాటు వీళ్లంతా కలిసి అడవిలో వేటకు వెళ్లి రెండు కృష్ణ జింకలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయం తెలిసి బిష్ణోయ్ వర్గానికి చెందిన కొంత మంది కేసు పెట్టారు. సల్మాన్‌ మీద భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం(1972) సెక్షన్ 51, సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలీ బింద్రే, నీలం మీద సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 149 కింద కేసులు నమోదయ్యాయి. 10 రోజుల తర్వాత సల్మాన్ అరెస్ట్ అయ్యారు. వెంటనే ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 1998లో ఘటన జరగ్గా, 2006లో విచారణ మొదలైంది. 2007లో సల్మాన్ ను న్యాయస్థానం దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించింది.

ఆ తర్వాత ఈ శిక్షను సస్పెండ్ చేసింది.  2018లో ఈ కేసుపై విచారణ జరగ్గా, సల్మాన్‌ ఖాన్‌ ను మరోసారి దోషిగా తేల్చిన న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో శిక్ష పడినప్పటికీ సల్మాన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ బ్యాచ్ ఆయను టార్గెట్ చేసింది.

కృష్ణ జింకల వేటపై సల్మాన్ ఏమన్నారంటే?

కృష్ణ జింకల వేట కేసుఓ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సల్మాన్, ఈ కేసు గురించి కీలక విషయాలు చెప్పారు. తాను కృష్ణ జింకలను చంపలేదని చెప్పారు. అవన్నీ కేవలం ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఆ సమయంలో తాము అక్కడ లేమన్నారు. కృష్ణ జింకలకు మూడుసార్లు పోస్టుమార్టం చేశారని, రెండుసార్లు ఆ జింకలు వేరే వేరే సమస్యలతో చనిపోయాని రిపోర్టు వచ్చిందన్నారు. మూడోసారి రిపోర్టు మారిందన్నారు. తన వాహనంలో ఉన్నది కూడా ఎయిర్ గన్ అన్నారు. దానితో కాల్చినా ఎవరికీ ఏం కాదన్నారు సల్మాన్.

నా కొడుకు జింకలను చంపలేదు- సల్మాన్ తండ్రి

సల్మాన్ కృష్ణ జింకలను చంపాడనే వార్తలను ఆయన తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు సలీం ఖాన్ ఖండించారు. అన్యాయంగా సల్మాన్ ను కృష్ణ జింకల పేరు చెప్పి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. “సల్మాన్ ఎవరికి క్షమాపణ చెప్పాలి? సల్మాన్ ఏదైనా నేరం చేశాడా? మీరు చూసారా? మీకు తెలుసా? విచారణ చేశారా? మేం ఎప్పుడూ తుపాకీ  ఉపయోగించలేదు. ఆ సమయంలో తాను అక్కడ లేనని సల్మాన్ చెప్పాడు. సల్మాన్ కు జంతువులంటే చాలా ప్రేమ. అతడు వేటకు వెళ్లడు. సల్మాన్ కు బాబా సిద్దిఖీకి ఎలాంటి సంబంధం లేదు. ఆస్తి తగాదాల కారణంగా సిద్ధిక్ హత్య జరిగింది” అని వెల్లడించారు. అయితే, ఆ రోజు సల్మాన్‌తో వెళ్లిన సెలబ్రిటీలకు ఎలాంటి ముప్పు లేదని, కేవలం వారి టార్గెట్ సల్మాన్ మాత్రమేనని తెలుస్తోంది.

Read Also:  జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×