BigTV English

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

President notifies appointment of Justice Sanjiv Khanna: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ అధికారికంగా వెల్లడించారు.


జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుతం సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక, జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వాత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.

ఆయన ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడెమీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి సీజేఐగా ఆయన 2025 మే 13 వరకు.. దాదాపు 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×