BigTV English
Advertisement

Drone Pilot Training: డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

Drone Pilot Training: డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

రకరకాలుగా అక్కరకొస్తున్న డ్రోన్లు

ఈ రంగం, ఆ రంగం అన్న తేడా లేదు.. అన్నిట్లోనూ డ్రోన్ల యుగమే నడుస్తోందిప్పుడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ ఓ మారుమూల ప్రాంతానికి అత్యవసరంగా మెడిసిన్స్ పంపాలి. రోడ్డు బాగాలేదు. వాగు పొంగింది అనుకుందాం.. సరిగ్గా ఈ డ్రోన్ మెడిసిన్స్ ను గమ్యస్థానాలకు చేర్చడంలో ఉపయోగపడుతోంది. వరదలు వచ్చినప్పుడు ఆహారం పంపేందుకు, సహాయ చర్యలు పర్యవేక్షించేందుకు, శానిటైజ్ చేసేందుకు అన్ని రకాలుగా అక్కరకొస్తోంది. అలాగని ప్రతి చిన్న పనికి హెలికాప్టర్లు రావాలంటే కష్టమే. అందుకే ఈ డ్రోన్లు పనులన్నీ పకడ్బందీగా చేసి పెడుతున్నాయి. అందుకే వీటికంత డిమాండ్.


సినిమాలు, సీరియల్స్ లో డ్రోన్ షూట్ కామన్

ఇప్పుడు ఏ సినిమా అయినా, సీరియల్ అయినా.. డ్రోన్ షాట్ లేకుండా ఒక్క సీన్ కూడా ఉండడం లేదు. పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ లోనూ డ్రోన్ కామన్ అయింది. ప్రస్తుతం డ్రోన్‌ సేవల రంగం విలువ 30 వేల కోట్ల రూపాయల దాకా ఉందని అంచనా. ఈ రంగంలో ఇప్పటికే 5 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరిగినట్లు ఇండస్ట్రీ చెబుతున్న మాట. ఫొటోగ్రఫీ, వ్యవసాయం, మైనింగ్, టెలికాం, బీమా, ఆయిల్‌-గ్యాస్, కన్ స్ట్రక్షన్, ట్రాన్స్ పోర్ట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, జియో మ్యాపింగ్, అడవులు-వన్యప్రాణుల పర్యవేక్షణ, డిఫెన్స్ వంటి రంగాల్లో డ్రోన్ల వాడకం చాలా వరకు పెరిగిపోయింది. డ్రోన్లలో సైజును బట్టి రకాలు ఉన్నాయి. ప్రొపెల్లర్స్, సైజు, కెపాసిటీ, రేంజ్, పవర్‌ సోర్స్, మోటార్లను బట్టి డ్రోన్లను వర్గీకరిస్తారు. నానో డ్రోన్లు స్పై కెమెరాలుగా వాడుతారు. మిడిల్ రేంజ్ వి ఫోటోగ్రఫీకి, ఇంకాస్త పెద్దవి అగ్రికల్చర్ కు, మరింత పెద్దవి పారిశ్రామిక అవసరాలకు వాడుతారు.

Also Read: చనిపోయినవాళ్లు తిరిగి వస్తారా? AIతో అది సాధ్యమేనట.. ఇదిగో ఇలా!

వన్యప్రాణుల రక్షణ, అడవుల నరికివేతకు చెక్

మిడ్‌ రేంజ్‌ డ్రోన్లు 12 వేల అడుగుల నుంచి 30 వేల అడుగుల ఎత్తు వరకు, సుమారు 24 గంటలపాటు ఎగరగలవు. దాదాపు 400 మైళ్ల వరకు వెళ్తాయి. వీటిని యుద్ధాలకు, నిఘాకు వాడతారు. అలాగే లాంగ్‌ రేంజ్‌ డ్రోన్లు.. 640 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్తాయి. వాతావరణ పరిస్థితిని కనుక్కునేందుకు, జియాలజీ, ఫిజికల్ మ్యాపింగ్‌ వంటి వాటి కోసం ప్రొఫెషనల్స్‌ వాడుతారు. ఇక చాలా సంస్థలు డ్రోన్ డెలివరీతో ప్రయోగాలు చేస్తున్నాయి. వన్యప్రాణుల రక్షణ, అడవుల నరికివేతను అడ్డుకునేందుకు ట్రాక్‌ చేయడం, తీర ప్రాంతాల తనిఖీ వంటి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకూ డ్రోన్లు సహకరిస్తున్నాయి. అంతే కాదు అడవుల్లో విత్తన వ్యాప్తికి డ్రోన్లను వాడుతున్నారు. ప్రాజెక్టు మ్యాపింగ్‌కు నేషనల్ హైవేస్ అథారిటీ.. డ్రోన్లను వాడుతోంది.

మైనింగ్‌ ప్రాంతాల్లో రియల్‌టైం చెకింగ్స్

ఇక డ్యాముల పరిశీలన, వరద నష్టం, నీటి కొరత, కరవు పరిస్థితుల అంచనాకు వీటితో వీలవుతుంది. పట్టణ ప్రాంతాల్లో 3డీ మోడల్‌ ల్యాండ్‌ మ్యాపింగ్, నిర్మాణాల పర్యవేక్షణకు వాడుతున్నారు. మైనింగ్‌ ప్రాంతాల్లో రియల్‌టైం చెకింగ్స్, గనుల మ్యాపింగ్‌తో పాటు అన్వేషణ, నేరాలు జరిగినప్పుడు క్రైంసీన్‌ డాక్యుమెంటేషన్ కు ఉపయోగపడుతోంది. మంటలను గుర్తించి ఫైర్ రెసిస్టెంట్ గ్యాసెస్, కెమికల్స్ స్ప్రేకు వాడుతున్నారు. ఏఐ ఆధారిత డ్రోన్లతో ట్రాఫిక్‌ కంట్రోల్ చేస్తున్నారు. బెంగళూరులో అయితే ఎయిర్ ట్యాక్సీలను రంగంలోకి దింపేందుకు అంతా రెడీ అయింది. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల కొద్దీ టైం పడుతోంది. దీంతో అక్కడ ఎయిర్ ట్యాక్సీలను కూడా రెడీ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ దాకా కేవలం 19 నిమిషాల్లోనే ఈ ఎయిర్ ట్యాక్సీలో వెళ్లొచ్చంటున్నారు. ఈ మేరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ కు, సర్లా ఏవియేషన్ సంస్థకు ఒప్పందం కూడా కుదిరింది. అన్నీ అనుమతులు వస్తే బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీల శకం మొదలవడం ఖాయమే.

భారత ఆర్మీ కోసం రూ.34,500 కోట్లతో ప్రిడేటర్ డ్రోన్లు

ఇక కీలకమైన రక్షణరంగంలోనూ డ్రోన్లు బాగానే ఉపయోగపడుతున్నాయి. భారత ఆర్మీ కోసం 34,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 31 ప్రిడేటర్‌ డ్రోన్ల సరఫరా కోసం అమెరికాతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రిడేటర్ డ్రోన్లు ఆర్మీ ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని.. సర్వైలెన్స్‌లో ఉంచేందుకు సహాయపడతాయి. దీంతో ఎక్కడ, ఎవరు ఏమి చేస్తున్నారనేది ఆర్మీ గుర్తించవచ్చు. రక్షణ రంగంలో నిఘాతోపాటు విపత్తులో సేవలందించే సిబ్బంది ప్రాణరక్షణకు రియల్‌టైం ఇంటెలిజెన్స్‌ను అందించడంలో డ్రోన్లు కీలకమవుతున్నాయి. వీటిని సరిహద్దు గస్తీతోపాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకూ వాడుతున్నారు. సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లలో డ్రోన్లు చాలా ఉపయోగకరంగా మారాయి.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×