BigTV English

Mokshagna: వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. వర్మ.. ?

Mokshagna: వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. వర్మ.. ?

Mokshagna: మొన్నటి వరకు.. నందమూరి వారసుడు ఎంట్రీ ఎప్పుడు..  నందమూరి వారసుడు ఎప్పుడు వస్తాడు.. ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎట్టకేలకు ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులు ఈ ఏడాదితో తీరాయి. నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవు ఎంట్రీ అధికారికంగా ప్రకటించారు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ చేతిలో కొడుకును పెడతాడు అనుకుంటే.. బాలయ్య జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించి కుర్ర డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.


విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అలాంటి పాన్ ఇండియా డైరెక్టర్ చేతిలో మోక్షు ఎంట్రీ అని తెలియడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతులు వేస్తున్నారు. మొదటి సినిమా కోసం నందమూరి వారసుడు పడిన కష్టం అంతా ఇంతా కాదు. బరువు తగ్గాడు.. లుక్ మార్చాడు.

Ka Movie: అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది


ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ అందరూ వారసుడు ఎలా ఉండాలి.. ? అనుకున్నారో మోక్షు అలా తయారయ్యాడు. మరి అలాంటి అందగాడి సరసన ఎలాంటి అందగత్తెను దించాలి అనేదానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చనే జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటినుంచి.. మోక్షు సరసన నటించే హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. మొదట అందాల అతిలోక సుందరి  శ్రీదేవి రెండోవారసురాలు ఖుషీ కపూర్ ను రంగంలోకి దించుతున్నారని వార్తలు వచ్చాయి.

అన్న ఎన్టీఆర్ నటించిన  దేవర సినిమాతో అక్క జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. తమ్ముడు మోక్షజ్ఞ నటిస్తున్న ఈ చిత్రంతో ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఆ వార్త దావానంలా పాకినా ఎవరు దీనిపై రెస్పాండ్ కాకపోవడంతో అవి రూమర్స్ గానే మిగిలాయి.దాని తరువాత ఇప్పుడు.. మరో సీనియర్ బ్యూటీ వారసురాలిని మోక్షు కోసం  చూస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్  ముద్దుల తనయ రషా తడాను  ఈ సినిమా కోసం సంప్రదించారని గుసగుస.

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

బాలయ్య – రవీనా  టాండన్ కలిసి బంగారు బుల్లోడు సినిమా చేశారు. ఇప్పుడు ఈ వార్తనే నిజమైతే .. వారి వారసులు కలిసి నటిస్తున్న చిత్రంగా పెద్ద సెన్సేషనే క్రియేట్ అవుతుంది.  రషా తడాను ఇప్పటివరకు టాలీవుడ్ అభిమానులు చూసిందే లేదు. అమ్మడు తల్లిని మించిన అందగత్తె. మోక్షుకు ఈడుజోడు కూడా బానే ఉంటుంది. అయితే.. మోక్షు కోసం ప్రశాంత్ వర్మ.. వారసురాళ్లనే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడు అనే ప్రశ్న ఎదురవుతుంది.

మొన్న శ్రీదేవి వారసురాలు.. ఇప్పుడు రవీనా వారసురాలు.. వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. ? కొత్త హీరోయిన్  తీసుకోవడానికి ఎందుకు మొగ్గు చూపడం లేదు. వారసురాలు అయితే.. ఇంకా హైప్ వస్తుందనా.. ? లేక  ఇలా చేస్తే ఇటు టాలీవుడ్ కు వారసురాళ్లను.. అటు బాలీవుడ్ కు వారసుడును పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో  బాలయ్యనే చేయమన్నాడా.. ? అనేది  తెలియాల్సి ఉంది. మరి  ఈ వారసురాళ్లలో.. నందమూరి వారసుడుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×