BigTV English

Artificial Intelligence: చనిపోయినవాళ్లు తిరిగి వస్తారా? AIతో అది సాధ్యమేనట.. ఇదిగో ఇలా!

Artificial Intelligence: చనిపోయినవాళ్లు తిరిగి వస్తారా? AIతో అది సాధ్యమేనట.. ఇదిగో ఇలా!

Artificial Intelligence: అయిన వారినీ.. ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణానాతీతం. ముఖ్యంగా, మనం అమితంగా ప్రేమించే వారి విషయంలో ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అనుభవించే వారికి తప్ప ఆ పెయిన్ ఎవ్వరికీ అర్థం కాదు. ఎన్ని పనుల్లో ఉన్నా వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒంటరిగా ఉన్న సమయంలో వారితో మాట్లాడుతుంటారు కొందరు. చనిపోయినవారు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మానసిక సమస్యలకు లోనవుతారు. అయితే ఇలాంటి వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో సంచలనాత్మక టెక్నాలజీ వచ్చింది. దీని సహాయంతో చనిపోయిన వారితో మాట్లాడొచ్చు కూడా! ఎలాగంటారా..?


చనిపోయిన వాళ్లు తిరిగివస్తారా..?

తొమ్మిది నెలలు ప్రాణానికి ప్రాణంగా కడుపులో కాపాడుకుని, కని పెంచిన బిడ్డను కోల్పోయిన ఓ తల్లి పడే ఆవేదన ఎవరితే మాట్లాడితే తీరుతుంది..? ఎవ్వరి ఓదార్పు ఆ తల్లికి సాంత్వన ఇవ్వలేదు. ఆమె మళ్లీ మామూలుగా మారాలంటే చనిపోయిన బిడ్డ బతికి రావాల్సిందే. లేదంటే, చనిపోయిన బిడ్డను కలిసి మాట్లాడాలి. ఇలా ప్రపంచంలో చాలా మంది ఇష్టమైన వారిని కోల్పోయి బాధపడుతున్నవారు ఉంటారు. చనిపోయిన తమ ఆత్మీయులతో మాట్లాడాలని భావిస్తారు. అయితే, చనిపోయిన వాళ్లు తిరిగివస్తారా..? సైన్స్ చావును దీర్ఘకాలం పొడిగించగలదేమో గానీ చనిపోయిన వారిని తిరిగి బతికించే అవకాశం లేదు. అయితే, వారితో మాట్లాడించగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దాన్ని సాధ్యం చేశారు కొందరు పరిశోధకులు, శాస్త్రవేత్తలు. ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్‌లో కనిపించింది అదే. ఇలాంటివే మరికొన్ని ఏఐ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చాట్ బాట్‌, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ మేధస్సుతో మనసుకు స్వాంతన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.


దక్షిణ కొరియాకు చెందిన డీప్‌బ్రెయిన్ ఏఐ టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఓ తల్లి తన బిడ్డతో మాట్లాడగలుగుతుంది. తన బిడ్డను తాక గలుగుతుంది. నిజానికి, ఇదొక అబద్ధమే కావచ్చు. కానీ మనసుకు కాస్త నెమ్మది ఇవ్వడానికి ఉపయోగపడే సాధనం. దక్షిణ కొరియాకు చెందిన డీప్‌బ్రెయిన్ ఏఐ మనుషుల వీడియో , వీడియోలను కొన్ని గంటలపాటు పరిశీలించి వారి ఫేస్, వాయిస్, ప్రవర్తన కాప్చర్ చేసి, ఆ తర్వత ఆ మనిషి ఆ మనిషి వీడియో-ఆధారిత అవతార్‌ను సృష్టించి.. ఇలా మాట్లాడేలా చేశారు. 96.5% అసలు వ్యక్తిని పోలి ఉండేలా క్లోనింగ్ చేస్తున్నారు. అలాంటి సాంకేతికత “వెల్ డయింగ్” సంస్కృతిని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన భాగమని ఆ కంపెనీ భావిస్తోంది. దీనిలో మనుషులు మరణానికి ముందుగానే సిద్ధమవుతారు. వారి కుటుంబ చరిత్రను, కథలను, జ్ఞాపకాలను ‘జీవిత వారసత్వం’గా వదిలి వెళతారు. అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది. అదీ కాకుండా, యూజర్లు అవతార్‌ను స్వయంగా సృష్టించలేరు. అయితే ఈ ప్రక్రియ చిత్రీకరించడానికి, అవతార్ ను రూపొందించడానికి వారు సంస్థకు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: ప్రపంచాన్ని వణికిస్తున్న ISISకు ప్రాణం పోసింది అమెరికానా? చరిత్ర చెబుతోన్న వాస్తవాలేంటీ?

2019లో ‘హియరాఫ్టర్‌ ఏఐ’ అనే చాట్‌బాట్‌ యాప్‌

ఏఐ ద్వారా మనుషులను తిరిగి కృత్రిమంగా జీవింపజేసేందుకు సైన్స్ ఫిక్షన్‌లో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందడంతో అదిప్పుడు సాధ్యమైంది. జేమ్స్ వ్లాహోస్‌ అనే వ్యక్తి తన తండ్రి జీవితం గురించిన ప్రశ్నలకు, ఆయన గొంతుతోనే సమాధానం చెప్పే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను తయారు చేశారు. 2019లో తన చాట్‌బాట్‌ను ‘హియరాఫ్టర్‌ ఏఐ’ అనే యాప్‌గా, ఓ బిజినెస్‌గా మార్చారు. ఈ యాప్‌తో మరణించిన వాళ్లను మళ్లీ కృత్రిమంగా జీవింపజేశాడు. హియరాఫ్టర్‌ ఏఐ యూజర్లు ఈ యాప్‌ని ఉపయోగించినప్పుడు వారి స్మార్ట్ ఫోన్, లేదంటే కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా తమ ప్రియమైన వారి ఫోటోలను అప్‌లోడ్ చేయొచ్చు. ఇందులో, చనిపోయిన వారి మాట తీరులోనే రాసే స్టైల్, వాయిస్ ఉంటుంది. అలా వారితో మాట్లాడే అనుభవాన్ని పొందొచ్చు.

“డెడ్ బాట్‌లను” రూపొందిస్తున్న చైనీస్ కంపెనీలు

ఇక, ఇటీవలి సంవత్సరాల్లో, అనేక చైనీస్ కంపెనీలు “డెడ్ బాట్‌లను” రూపొందిస్తోంది. మరణించిన వ్యక్తులను అనుకరిస్తూ AI అవతార్‌లను సృష్టిస్తోంది. ఈ డిజిటల్ కాపీలు మరణించిన వారి నుండి ఆడియోవిజువల్ మెటీరియల్ వాల్యూమ్‌లను సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేయడం ద్వారా రూపొందిస్తారు. తద్వారా కుటుంబ సభ్యులు వారి మరణించిన బంధువుల అవతార్‌లతో మాట్లాడొచ్చు. దీని కోసం, వాయిస్ రికార్డింగ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను విశ్లేషించి మరణించిన వ్యక్తిని పోలి ఉండే డిజిటల్ వ్యక్తిత్వాన్ని తయారుచేస్తారు. అమెరికాకు చెందిన స్టోరీ ఫైల్ అనే సంస్థ కూడా ఇలాంటి ఏఐ టెక్నాలజీని రూపొందించింది. అయితే, ఈ టెక్నాలజీ కొంత వివాదానికి కూడా కారణం కాకపోలేదు. దుఃఖాన్ని అధిగమించే విషయంలో మనుషుల సహకారం కన్నా పెద్ద ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తున్నారు. మనుషులతో సన్నిహితంగా ఉండడం, వారి పట్ల శ్రద్ధ చూపించడం, మనం చేసే పనులను ప్రశంసించడం… ఇలాంటి విషయాల్లో సాంకేతికత జోక్యం అమానవీయమని విమర్శిస్తున్నారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×