Big Stories

Assembly bypoll Voting: ఏడు రాష్ట్రాలు..13 అసెంబ్లీ సీట్లకు పోలింగ్

Assembly bypoll Voting: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు ఉప పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్ర ఆరు వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాటిలో బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి.

- Advertisement -

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరికొందరు చనిపోవడంతో ఆయా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

- Advertisement -

వాటిలో బీహార్‌లోని ఒక స్థానం, బెంగాల్‌లో నాలుగు సీట్లు, ఉత్తరాఖండ్‌లో రెండు, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు ఒకొక్కటి కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినవి పది సీట్లు ఉండగా, ఎమ్మెల్యేలు మరణంతో ఖాళీ అయిన సీట్లు మూడు ఉన్నాయి.

ALSO READ: దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం, సంపద లెక్కింపు ఎప్పుడంటే..

ఉదయం 9 గంటల వరకు బీహార్- 9.23 శాతం, హిమాచల్ ప్రదేశ్- 15, మధ్యప్రదేశ్-16.90, పంజాబ్ -10.30, తమిళనాడు-12.94, ఉత్తరాఖండ్-7, బెంగాల్- 11శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. జూలై 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News