EPAPER

Premature Aging Habits: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. త్వరగా వృద్ధాప్యం వస్తుంది జాగ్రత్త!

Premature Aging Habits: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. త్వరగా వృద్ధాప్యం వస్తుంది జాగ్రత్త!

Premature Aging Habits: ప్రస్తుత రోజుల్లో 50 శాతం మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నా.. మరో 50 శాతం మంది మాత్రం తమ ఆహారపు అలవాట్లపై అశ్రద్ధగా ఉంటున్నారు. తరచూ బిజీబిజీ లైఫ్ గడపుతుండడంతో ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి అనేక రకాల సమస్యల కారణంగా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు ఈ వ్యాధుల కారణంగా త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయట. ఇటీవల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో చాలా మంది మృత్యువాత పడడం చూస్తూనే ఉన్నాం.


ఈ సమస్యలు వయస్సుతో సంబంధం లేదని, కేవలం తరచూ తీసుకునే ఆహారం వల్లే ఈ ప్రమాదాలు వస్తున్నాయట. ఈ మేరకు ఆరోగ్య నిపుణులు సంచలన విషయాలు బయటపెట్టారు. జీవనశైలిలో ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా మనిషి త్వరగా చనిపోయే అవకాశాలు ఉంటాయట. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

టెక్నాలజీ అత్యధికంగా వాడకంలో ఉన్న ఈ రోజుల్లో మనుషులు తమ పనులను సులువుగా చేసుకుంటున్నారు. టెక్నాలజీని వాడుకుని ఏ కష్టం లేకుండా త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చూసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం వాడుకంలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులే మనుషులకు పెద్ద ముప్పు అని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అధికంగా వాడుతున్న ఈ రోజుల్లో దాదాపు 12 నుంచి 18 గంటల పాటు మొబైల్ ఫోన్లనే చూస్తూ ఉంటున్నారు.


Also Read: How To Get Rid Of Pot Belly : మీ బొడ్డు కుండలా మారుతుందా..?

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తరచూ ఇదే విధంగా పనుల కోసం మాత్రమే కాకుండా అనవసరమైన వాటి కోసం కూడా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ కారణంగా నిద్ర కూడా సరిగా పోవడం లేదు. దీంతో కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. సాధారణంగా మనిషి 7 నుంచి 9 గంటల సమయం పాటు నిద్ర పోవాలి. నిద్ర ఎంత ఉంటే మొదడు అంత చురుకుగా పనిచేస్తుంది. కానీ తరచూ ఫోన్ల వెంటే ఉండడం వల్ల నిద్ర కూడా సరిగా పోవడం లేదు.

ముఖ్యంగా నిద్ర లేకపోవడం ఒక కారణం అయితే, తరచూ తీసుకునే ఆహారం మరొక కారణం అని చెబుతున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లలో తరచూ మాంసాహారాన్ని తీసుకోవడం, సిగరెట్, మద్యం వంటి అలవాట్ల కారణంగా కూడా త్వరగా ముసలివాళ్లు అవుతారట. మరోవైపు శరీరం అలసిపోతేనే ఆరోగ్యం ఉన్నట్లని నిపుణులు అంటున్నారు.

Also Read: మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే?

తరచూ పనుల పేరుతో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, కండరాల బలహీనత ఏర్పడి, ఎక్కువగా నడవడానికి ఇష్టపడకుండా తయారవుతారు. అందువల్ల తరచూ నడవడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. శరీరానికి చెమటలు పట్టేంత వరకు పనులు చేయడం అనేది చాలా ముఖ్యం. మారుతున్న జీవనశైలి వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన బాధ్యతే.

Related News

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ? ఇలా చేస్తే సమస్య దూరం

Turmeric Milk: చలికాలంలో పసుపు పాలు త్రాగితే.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?

Tips For Eyelashes: ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయ్

Coconut Oil For Face: ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Face Glow Tips: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్‌లతో మీ అందం రెట్టింపు

Haircare Tips: జుట్టు విపరీతంగా రాలిపోతుందా ? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో !

Karivepaku Rice: సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి

×