BigTV English

Danger of Eating Non Veg: మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..?

Danger of Eating Non Veg: మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..?

Non Veg Cause Heart Attack and Colon Cancer: శరీర ఆరోగ్యాన్ని రక్షించడంలో ఆహారం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో శాఖాహారం, మాంసాహారం రెండు కూడా శరీరానికి చాలా అవసరం. అయితే కొంత మంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటే.. మరికొంత మంది శాఖాహారాన్ని ఇష్టంగా తీసుకుంటారు. ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. అయితే మరికొంత మంది రెండింటిని ఇష్టంగా తింటుంటారు. అయితే ముఖ్యంగా కేవలం మాంసాహారాన్ని తీసుకునే వారు అయితే ప్రస్తుత కాలంలో ఎక్కువ మందే ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అంటూ ఏ పార్టీలు జరిగినా నాన్ వెజ్ అనేది ఎక్కువగా పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో మాంసాహార ప్రియులకు పండుగనే చెప్పాలి. తరచూ జరుగుతున్న ఏదో ఒక ఈవెంట్లతో మాంసాహారాన్ని ఎక్కువగా తింటుంటారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. అంతేకాదు మాంసాహారం ఎక్కువగా తినే వారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.


ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. ఇది ప్రస్తుతం ముఖ్యమైన సవాలుగా మారిందని వైద్య పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో పెద్ద ప్రేగు జీర్ణ వ్యవస్థలోని ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. పోషకాల శోషణ, కడుపులోంచి వ్యర్థాలను తొలగించడం వంటి పనులకు అంతరాయం కలుగుతుందని.. దీని వల్ల ప్రమాద కారకాలు ఈ క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉంటాయని అన్నారు. అయితే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వస్తుందని అంటున్నారు.

Also Read: How To Get Rid Of Pot Belly : మీ బొడ్డు కుండలా మారుతుందా..?


ముఖ్యంగా పీచు పదార్థాలు, కొవ్వు, ఊబకాయం, ఆల్కహాల్ లేదా పొగాకు తీసుకోవడం వంటి వాటి వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం లేదా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడతారట. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు అందులో రసాయనాలు ఉత్పత్తి అవుతాయట. అందువల్ల మాంసాహారం కంటే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయడం, వంటి అలవాట్లను నేర్చుకోవాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అయితే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగులో లక్షణాలు ఉంటాయి. మలంలో రక్తం, విరేచనాలు, మలబద్ధకం, మల విసర్జన, కడుపునొప్పి, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

Disclaimer: ఈ కథనాన్ని నిపుణుల సలహాల మేరకు అందిస్తున్నాం. ఇది సాధారణ సమాచారం మాత్రమే. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×