BigTV English
Advertisement

Causes of Pot Belly: మీ బొడ్డు కుండలా మారుతుందా..? కారణం ఇదే.. కార్బోహైడ్రేట్స్ మానేస్తే చాలు!

Causes of Pot Belly: మీ బొడ్డు కుండలా మారుతుందా..? కారణం ఇదే.. కార్బోహైడ్రేట్స్ మానేస్తే చాలు!

How To Get Rid Of Pot Belly: మనలో చాలా మంది చూడటానికి స్లిమ్‌గా కనిపిస్తారు. కానీ వారి పొట్ట బయటికి పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది. అలాంటి వారి పొట్ట ఆకారం గుండ్రని కుండలా ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారిలో కూడా పొట్ట బయటకు పొడుచుకుని వచ్చి గుండ్రంగా, పెద్దగా కనిపిస్తుంది. ఇది శరీరానికి ఆకృతి లేని రూపాన్ని ఇస్తుంది. ఇటువంటి వాకు బట్టలు ధరిస్తే చూడటానికి బాగుండదు. ఈ రకమైన పొట్టను ‘పాట్ బెల్లీ’ అంటారు. అంటే కుండలా కనిపించే కడుపు అని అర్థం. ఈ సమస్య పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పొడవుగా స్లిమ్‌గా ఉన్నప్పటికీ, అతని గుండ్రని బొడ్డు కారణంగా భారీ ఆకారంలో కనిపిస్తారు. ఇది ఇలా ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కుండ బొడ్డు కారణం ఏమిటి, ఇది ఏదైనా శారీరక సమస్యా? దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.


కుండ పొట్టకు కారణం

వైద్యనిపుణులు అభిప్రాయం ప్రకారం.. పురుషులలో కుండ బొడ్డు అనేది చాలా సాధారణం. కుండ బొడ్డు నెమ్మదిగా కొవ్వు కాలేయం లక్షణంగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అత్యంత ఎక్కువగా ఉన్న జీవక్రియ వ్యాధులతో ఫ్యాటీ లివర్ వ్యాధి ఒకటి.


శరీరం యొక్క కండరాలు, కణజాలాలకు శక్తి అవసరమైనప్పుడు రక్తం నుండి గ్లూకోజ్‌ను గ్రహించడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది. అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు గ్లూకోజ్ నిల్వ చేయడానికి కాలేయం కూడా సహాయపడుతుంది. శరీరం ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తే మన కణాలు ఇన్సులిన్‌కు అవసరమైన విధంగా స్పందించవని అర్థం. ఫలితంగా కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది.

Also Read: చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా? నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు?

  • మీ కుండ లాంటి పొట్ట తగ్గి స్లిమ్‌గా కనిపించాలంటే.. మీరు తక్కువ కార్బన్ డైట్ తీసుకోవాలి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది.
  • బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు కాలేయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • క్లోరోఫిల్ కాలేయం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ ఆహారంలో ప్రతిరోజూ పుష్కలంగా ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి.
  • ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, డైరీ ప్రొడక్ట్స్, ప్యాక్డ్ ఫుడ్స్, షుగర్, రిఫైన్డ్ ఫ్లోర్, పండ్లలో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవడం తగ్గించండి. ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంది.
  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్, ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను సరఫరా చేయడానికి మీరు ఒమేగా 3 క్యాప్సూల్స్, అవిసె గింజలు, చేపలు, వాల్‌నట్‌లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవచ్చు.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహాల మేరకు, పలు జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా  అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే చూడండి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×