Big Stories

ASUS Vivobook 15: ఇదేం ఆఫర్రా బాబు మతిపోతుంది.. రూ.29వేల ల్యాప్‌టాప్‌ కేవలం రూ.990లకే!

ASUS Vivobook 15: ఇప్పుడంతా ఆన్‌లైన్ మయం అయిపోయింది. ఏ వర్క్ చేయాలన్నా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి వస్తోంది. ఉద్యోగస్తుల నుంచి చిన్నపిల్లల చదువుల వరకు అంతా ఆన్‌లైనే. అయితే ఈ సమయంలో పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అందులో ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఒకప్పుడు ఈ ల్యాప్‌టాప్‌లను కేవలం ఆఫీసు యూజింగ్ కోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరి చేతుల్లోనూ కనిపిస్తుంది. అంతేకాదండోయ్.. స్కూల్ పిల్లలకు సైతం ల్యాప్‌టాప్ అవసరాలు ఉంటున్నాయి. అందువల్లనే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు తమ ల్యాప్‌టాప్ మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. దీనివల్ల వీటిని కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నవారికి చాలా కష్టంగా మారింది.

- Advertisement -

అయితే ఎప్పట్నుంచో ల్యాప్‌టాప్ కొనుక్కోవాలని అనుకుంటున్నవారికి ఇప్పుడొక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అత్యంత తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ వివోబుక్ 15 ఇంటెల్ కోర్ ఐ3 11జెన్ 1115జి4 (ASUS Vivobook 15 Intel Core i3 11th Gen 1115G4) ల్యాప్‌టాప్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.44,990 ఉండగా.. ఇప్పుడు 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.28,990లకే కొనుక్కోవచ్చు.

Also Read: ష్.. బాగా ఉక్కపోస్తుందా.. సగం ధరకే ఈ ఏసీని కొనేయండి మావా..!

దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే HSBC, HDFC, OneCard క్రెడిట్/ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్లు కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.28000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది.

ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.990లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఈ ఆఫర్ పొందాలంటే.. పాత డివైజ్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అంతేకాకుండా మీ పిన్‌కోడ్‌ను బట్టి కూడా ఎక్స్ఛేంజ్ వాల్యూ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొనుక్కునే ముందు పిన్‌కోడ్ చెక్ చేసుకోండి. కాగా ఈ Asus VivoBook 15 ల్యాప్‌టాప్.. మీ పనిదినాన్ని సులభతరం చేయడానికి, పనితీరును మెరుగుపరచడానికి సృష్టించబడింది అని కంపెనీ చెబుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News