Big Stories

Foods to Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్థాలు ఇవే ..

 

- Advertisement -

Best Foods to Lower Cholesterol

- Advertisement -

Best Foods to Lower Cholesterol (health tips in telugu): ఈ రోజుల్లో మారిన జీవనశైలి వల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే.. తినే ఆహారంలో మార్పులు చేసుకోవటం వల్ల ఈ సమస్యలను కొంతమేర నివారించటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాల వివరాలు మీకోసం..

వెల్లుల్లి
ఘాటయిన వెల్లుల్లి గుండెకు నేస్తం. క్యాన్సర్‌‌కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా నూనెలో వేయించరాదు. వెల్లుల్లిని వలిచి 10 నిమిషాలు అలా ఉంచితే అందులోని అలిసిన్ అనే క్యాన్సర్‌ నిరోధక ఎంజైమ్‌ బాగా మెరుగవుతుంది.

ఆపిల్
రోజుకో ఆపిల్ తింటే.. అందులోని మాలిక్ యాసిడ్ కారణంగా రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గటంతో బాటు లివర్ తయారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.

బీన్స్
బీన్స్‌లోని కరిగే పీచు, లేసిథిన్ అనే రసాయనం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తయారీని నిరోధిస్తుంది. దీనిలోని పొటాషియం, కాపర్, ఫాస్పరస్, మాంగనీస్, ఫోలిక్ ఆమ్లాలూ ఇందుకు దోహదపడతాయి.

బెర్రీస్
బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, రక్త ప్రసరణ వ్వవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో కరిగే గుణం ఉన్న పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటకు పంపుతుంది.

ద్రాక్ష
ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాషియం, శరీరంలోని విష పదార్ధాలను నిర్వీర్యం చేస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్లు దీనిని తినకపోవడమే మంచిది.

జామపండు:
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. వీటిలోని విటమిన్లు, పోషకాలు ఆరోగ్యవంతంగా చేస్తాయి.

పుట్టగొడుగులు
కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో మష్రూమ్స్ లోని విటమిన్స్ B, C కాల్షియం మినరల్స్ బాగా ఉపయోగపడతాయి.

Read more: ఇయర్ బడ్స్ వాడుతున్నారా? ..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి!

గింజలు

బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఓలియిక్ ఆమ్లం, గుండెను, వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో ఆన్ సాచురేటెడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. వాల్ నట్స్ లోమి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాలను గణనీయంగా తగ్గిస్తాయి.

సోయా

గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్తాయిలను తగ్గిస్తుంది. శాకాహార మాంసకృత్తులు సోయాలో అధికంగా ఉంటాయి. సోయా చిక్కుళ్లలో విటమిన్ b3, b6, E ఉన్నాయి.

ఓట్ మీల్

దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచు పదార్దం స్పాంజి వలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.

పొట్టు తీయని గింజలు

గోధుమ, మొక్కజొన్న, బార్లి వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు, రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News