Big Stories

BCCI About Hardik Pandya: పాండ్యాను ఎందుకు తొలగించలేదంటే? బీసీసీఐ అధికారి వివరణ..

 

- Advertisement -

Why not remove Pandya? BCCI official

- Advertisement -

BCCI Did Not Drop Hardik Pandya From the Central Contract: హార్దిక్ పాండ్యా కూడా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడలేదు, మరి అతన్ని తొలగించకుండా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లపై వేటు వేయడం ఏమిటి? అని నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం గుజరాత్ వాడన్న ప్రేమతోనే జైషా ఇలా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు దాడికి దిగుతున్నారు. ఇది బీసీసీఐ పై విపరీతమైన ప్రెజర్ పడుతోంది. దీంతో బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయంపై వివరణ ఇచ్చినట్టు జాతీయ పత్రిక ఒకటి వెల్లడించింది.

విషయం ఏమిటంటే తను జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్లు సయ్యద్ ముస్తాక్ ఆలి ( టీ 20), విజయ్ హజారే తదితర ట్రోఫీలలో ఆడతానని  హార్దిక్ పాండ్యా  హామీ ఇచ్చాడు. ఎలాంటి షరతులు లేకుండా పాల్గొంటానని తెలిపాడు.

కానీ ప్రస్తుతం తను రెడ్ బాల్ ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే తను గాయపడి ఉన్నాడు. తను కోలుకొని వచ్చేసరికి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత వెంటనే టీ 20 వరల్డ్ కప్ మొదలవుతుంది. ఇంక ఆడే అవకాశం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించాడు.

Read more: దేశవాళీ క్రికెట్ పై టర్న్ అయిన.. ఉన్ముక్త్ చంద్ మాటలు

రెండోది ఒకవేళ తను గాయం నుంచి కోలుకున్నాక, ఈ టోర్నమెంట్లు ముగిశాక కూడా తను దేశవాళీ పోటీల్లో పాల్గొనకపోతే, అప్పుడతని కాంట్రాక్టు రద్దవుతుంది అని తేల్చి చెప్పాడు.

ఇక శ్రేయాస్, ఇషాన్ పరిస్థితి వేరు అని తెలిపాడు. హార్దిక్ తో వారిని పోల్చకూడదని అన్నాడు. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఫామ్ కోల్పోయి ఉన్నారు, అందుకే దేశవాళీ పోటీల్లో పాల్గొనమని చెప్పాం. అది వాళ్ల మంచి కోసమే కదా… చెప్పామని అన్నారు. వాళ్లిక రెడ్ బాల్ క్రికెట్ ఆడం, వన్డేలు, టీ 20లు మాత్రమే ఆడతామని ఫిక్స్ అయితే ఎలా? అని ప్రశ్నించారు.

దేశం కోసం ఆడాలి? తమ అవసరం ఉన్నప్పుడు ఏ జట్టులో ఆడమంటే అక్కడ ఆడాలి. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలి. మళ్లీ టెస్ట్ జట్టులో నిరూపించుకోవాలి. అక్కడికెళ్లాలి. ఇదంతా ఒక ప్రయాణం అని చెప్పారు.

నిజానికి కపిల్ దేవ్, గవాస్కర్, సచిన్ కాలంలో సామాజిక మాధ్యమాలు ఉండేవి కావు. బీసీసీఐ సొంత పెత్తనం ఉండేది. ఒక అరాచకం నడిచేది. వాళ్లేం చేసినా చెల్లుబాటయ్యేది. ఆటగాళ్లు కూడా నోర్మూసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 140 కోట్ల మంది ప్రజలకి బీసీసీఐ సమాధానం చెప్పాలి. ఏ ఆటగాడి భవిష్యత్తుతో ఆటలాడితే, వారికి తకిట తథిమి తప్పదని కొందరు కామెంట్ చేస్తున్నారు,

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News