BigTV English

Ear buds : ఇయర్ బడ్స్ వాడుతున్నారా? ..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి!

Ear buds : ఇయర్ బడ్స్ వాడుతున్నారా? ..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి!

Ear Buds


Ear buds Side Effects : ప్రస్తుత కాలంలో బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల్లో ఎయిర్‌పాడ్స్‌, ఇయర్‌బడ్స్‌, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్స్ అందుబాటులో ఉంటున్నాయి. చూడటానికి చిన్నగా ఉండే ఇయర్ బడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటి ద్వారా విడుదలయ్యే రే రేడియేషన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ జెర్రీ ఫిలిప్స్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లూటూత్ లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ వాడకం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇయర్ బడ్స్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల మెదడు కణజాలం దెబ్బతింటుంది.


Read More : స్లీప్ ఆప్నియా.. ఈ ఆహారాలతో గుడ్ బై చెప్పండి!

ఇయర్ బడ్స్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన శరీరానికి హాని కలిగిస్తాయి. ఇయర్ బడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వీటి ప్రమాదం చిన్నారులు, గర్భిణుల్లో ఎక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా న్యూరోలాజికల్ ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన రుగ్మతలు వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఇయర్ బడ్స్ వల్ల చెవి పోటు ప్రమాదం ఉంది. వినికిడి సమస్యలు దీని కారణంగా పెరిగే అవకాశాలు ఉంటాయి.

అలానే చెవిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందని తేల్చారు. తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. వైర్‌లెస్ పరికరాల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాల గురించి పరిశోధన జరుపాలని దాదాపు 42 దేశాలకు చెందిన 247 మంది శాస్త్రవేత్తలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ను కోరారు.

ఇయర్ బడ్స్ వల్ల వచ్చే ప్రమాదాలు..

న్యూరోలాజికల్ వ్యాధులు

ఇయర్ బడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ వల్ల మెదడు కణజాలం దెబ్బతింటుంది. ఇది నాడీ సంబంధిత వ్యాధులకు కారణం కావొచ్చు.

బ్రెయిన్ క్యాన్సర్

ఇయర్ బడ్స్ నుంచి వెలువడే రేడియేషన్ మెదడులో కణితి ఉంటే.. రేడియేషన్ వాటిని పెంచడానికి దోహదపడుతుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల వస్తాయి.

స్పెర్మ్‌పై ప్రభావం

ఇయర్ బడ్స్ తరచూ ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ తగ్గిపోతుంది. స్త్రీ పురుషులు వీటికి దూరంగా ఉండటం మంచిది.

రేడియేషన్ నుంచి ఇలా రక్షించుకోండి..

  • వైర్డ్ హెడ్‌ఫోన్‌లు వాడండి.
  • ఫోన్ 10 అంగుళాల దూరంలో పట్టుకుని మాట్లాడండి.
  • హ్యాండ్‌సెట్‌లు, ఫోన్‌లను శరీరానికి దూరంగా ఉంచండి.
  • ఫోన్ దిండు కింద పెట్టుకుని నిద్రపోవద్దు.
  • నాణ్యత గల ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించండి
  • 60 నిమిషాలకు మించి ఇయర్‌ఫోన్‌లను వాడకండి.

Disclaimer : ఈ కథనాన్ని వైద్య అధ్యయనాలు అధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×