Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్‌లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణంలో దుమ్ము, ధూళి కణాల శాతం పెరగడంతో గాలి నాణ్యత క్షీణించింది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరిగా ఉంది.
పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనంతో ప్రతీయేటా వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రోడ్లు, చెట్లపై ఉన్న దుమ్మును శుభ్రపరిచేందుకు వాటర్ ట్యాంకర్లు, స్మాగ్ గన్స్‌తో సిబ్బంది నీటిని చల్లుతున్నారు.