EPAPER

Chandra Grahanam : చంద్రగ్రహణం.. ఆలయాలు క్లోజ్..

Chandra Grahanam : చంద్రగ్రహణం.. ఆలయాలు క్లోజ్..

Chandra Grahanam : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం 2గంటల37 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేశారు. ఇవాళ వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సుప్రభాతం తదితర సేవలు నిర్వహించారు.


అనంతరం ద్వార బంధనం చేశారు. చంద్రగ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
చంద్రగ్రహణం సందర్భంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు సైతం ఉండవని వెల్లడించారు.

తిరుమల ఆలయం


చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు కూడా మూసివేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, గోవిందరాజుల స్వామి కపిలతీర్థం ఆలయాలు మూసివేశారు. అదేవిధంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, ఉప ఆలయాలను ఉదయం 8 గంటలకే మూసి వేశారు. మరోవైపు శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేతపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు బాబు స్వామితో మా ప్రతిని ధి దామోదర్ ముఖాముఖి.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం

రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రధానాలయం మూసివేశారు. ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయం తో పాటు ఉపాలయాల తలుపులు మూసేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు అమ్మవారి ప్రధానాలయం, ఉప ఆలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహించనున్నారు.

అర్చన, మహానివేదన, హారతి ఇచ్చి మరోసారి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేశారు. ఉదయం 8 గంటల లోపు ఉన్న సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ శాంత్రి హోమం, రుద్రహోమాలు మాత్రమే భక్తులకు అనుమతిచ్చారు. తర్వాత ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీ చక్ర నవావరణార్చన, చండీహోమం, పంచ హారతులు, పల్లకీ సేవ మొదలైన సేవలన్నీ రద్దు చేశారు.

బుధవారం ఉదయం యధావిధిగా అన్ని దర్శనాలు, ఆర్జిత సేవలు పునః ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు శ్రీనివాస శాస్త్రి వెల్లడించారు. గ్రహణ సమయంలో నది ఒడ్డున జపాలు చేయడం, ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే మంచిదన్నారు. మేష రాశి అలాగే కొన్ని రాశుల వారు గ్రహణానంతరం దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలుగుతాయని వివరించారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకపోవడం మంచిదని సూచించారు. గ్రహణానంతరం విడుపు స్నానం చేసి దానాలు ఇవ్వాలన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం

చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మూత పడింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆలయం మూసి ఉంచనున్నారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామివారికి మహా నివేదనతో ప్రదోషపూజ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 8 గంటల తరువాత భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తామని ఆలయ అధికారులకు వెల్లడించారు.

శ్రీశైలం

చంద్ర గ్రహణం కారణంగా శ్రీశైలం దేవస్థానాన్ని మూసివేశారు అధికారులు. సాయంత్రం ఆరున్నరవరకు గుడి తలుపులు తెరుచుకోవు. ఉదయం స్వామిఅమ్మవార్లకు సుప్రభాత సేవ, మంగళహారతులు నిర్వహించారు. తిరిగి సాయంత్రం ఆరున్నరకు ఆలయ తలుపులు తెరిచిన తర్వాత ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 8 తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.

ధర్మపురి ఆలయం

జగిత్యాల జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామీ వారి నిత్య పూజల అనంతరం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల తలుపులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, గ్రహశాంతి హోమాధులు నిర్వహించనున్నారు. ఉత్సవ విగ్రహాల పులి క్యాపు, నిత్య అభిషేకాభినంతరం భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ వేద పండితులు బొజ్జ రాజగోపాల్ శర్మ తెలిపారు.

Tags

Related News

Spa Centers: తిరుపతిలో స్పా అండ్ మసాజ్ సెంటర్లపై దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు..!

Pavan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్..

Anchor Shyamala: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్లాన్ అంతా ఆ సినిమా చూసే చేశారా ?

Vijayasai Reddy: మళ్లీ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..

Balakrishna vs YS Jagan: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

Mumbai actress kadambari case: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

Big Stories

×