Big Stories

Mahua Moitra | లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మొయిత్రా

Mahua Moitra | ఇటీవల లోక్ సభ నుంచి బహిష్కరణ గురైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ మహువా మొయిత్రా సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన సభ్యత్వం రద్దు చేయడంపై ఆమె అత్యున్నత కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఆమెపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బహిష్కరణ వేటు వేశారు. ఆమె ఆరోపణలపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అదానీ గ్రూపు కంపెనీల అవినీతిపై విపక్షాలతో పాటు ఆమె గతంలో పార్లమెంటులో చర్చించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. అయినా ఆమె పట్టువదలకుండా పార్లమెంటులో పలుమార్లు అదానీ కంపెనీ అవినీతి గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అలా చేసేందుకు ఆమె వ్యాపారవేత్త వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని అధికారంలో ఉన్న బిజేపీ ఆరోపణలు చేసింది.

మరోవైపు ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అప్రూవర్‌గా మారారు. దీంతో మహువా మొయిత్రా కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా ఆమె తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News