Big Stories

Captain Fatima | ప్రమాదకరమైన యుద్ధభూమిలో తొలి మహిళా డాక్టర్.. అక్కడ పొంచిఉన్న ఇద్దరు శత్రువులు!

Captain Fatima | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా కెప్టెన్ ఫాతిమా వాసిమ్ నియమితులయ్యారు. సియాచిన్ బాటిల్ స్కూల్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఫాతిమా వాసిమ్ చరిత్ర సృష్టించారని ఇండియన్ ఆర్మీ అభినందించింది. తాజాగా ట్విట్టర్ లో ఆమెను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. 15,200 అడుగుల ఎత్తులో, ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో సియాచిన్ ఉంది.

- Advertisement -

సియాచిన్ గ్లేసియర్‌లో మోహరించిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా కెప్టెన్ ఫాతిమా వాసిమ్ చరిత్ర సృష్టించారు. కెప్టెన్ ఫాతిమా వాసిమ్ అద్భుత విజయాన్ని సాధించినందుకు దేశం ఆమెను మెచ్చుకుంటోంది. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లో పోస్టింగ్ పొందారు.

- Advertisement -

సియాచిన్ సరిహద్దుల్లో 1984 నుంచి ఇప్పటివరకు యుద్ధం చేయకుండానే కేవలం వాతావరణం కారణంగా 873 మంది భారత సైనికులు మరణించారని గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిని బట్టి తెలుస్తోంది అక్కడి వాతావరణం ఎంతటి ప్రమాదకరమో. అందుకే సియాచిన్ ప్రాంతంలో భారత సైనికులకు ఇద్దరు శత్రువులని అంటుంటారు. ఒకటి పొరుగు దేశం పాకిస్తాన్ కాగా.. మరొకటి ఆ ప్రాంత వాతావరణం.

15,200 అడుగుల ఎత్తులో హిమపాతాల మధ్య కర్తవ్య నిర్వహణకు కెప్టెన్ ఫాతిమా వాసిమ్ వెళ్లడం.. ఆమె సాహసానికి నిదర్శనం. సియాచిన్ గ్లేసియర్ పరిస్థితులు ఆమెకు సవాల్ గా మారాయి. అంతటి ఒత్తిడి ఉన్నా ఆమె
అచంచలమైన అంకితభావంతో పరిస్థితులను అదిగమించారు ఫాతిమా వాసిమ్.

ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కెప్టెన్ ఫాతిమా వాసిమ్ వీడియోను షేర్ చేశారు. సియాచిన్ గ్లేసియర్ వద్ద ఒక ఆపరేషనల్ పోస్ట్‌లో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా
ఫాతిమా వాసిమ్ నిలిచింది.

ఇంతటి బలీయమైన ఎత్తులో మోహరించడం కెప్టెన్ ఫాతిమా వాసిమ్‌ సంకల్పానికి ప్రతీక. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఫాతిమా వాసిమ్. ఆమె చారిత్రాత్మక పోస్టింగ్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, సాయుధ దళాలలోని లింగ భేదాల అడ్డంకులను బద్దలు కొట్టిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News