Big Stories

CM Revanth Reddy tweet : జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజా దర్బార్ పై రేవంత్ ఎమోషనల్ ట్వీట్..

CM Revanth Reddy Tweet : ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ప్రజా దర్బార్‌ పై ఎమోషనల్ గా ట్వీట్‌ గా చేశారు. జనం కష్టాలు వింటూ… కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగిందని పేర్కొన్నారు. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుందని ట్వీట్‌ చేశారు.

- Advertisement -

సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉదయం 10 గంటలకు జ్యోతిరావుఫూలే ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు సామాన్యులు భారీగా తరలి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. అభాగ్యుల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేపట్టారు. గతంలో ప్రగతి భవన్ గా ఉన్న సమయంలో ఇక్కడ ఆంక్షలు ఉండేవి.

బీఆర్ఎస్ పాలనలో సామాన్యులనే కాదు గద్దర్ లాంటి తెలంగాణ యుద్ధనౌకను అడ్డుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ప్రారంభంకాగానే ప్రగతి భవన్.. ప్రజా భవన్ గా మారిపోయింది. సామన్యుడు తన సమస్యను ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం దక్కింది. కాంగ్రెస్ ముందునుంచి చెబుతున్నట్లుగానే తమది ప్రజా ప్రభుత్వమని తొలి అడుగులోనే నిరూపించుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News