Big Stories

CM Jagan: ప్రతి ఇంటికి రూ.2500, 25 కేజీల బియ్యం : సీఎం జగన్

CM Jagan: గడిచిన వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. శుక్రవారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో.. భారీ వర్షాల కారంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రం కురిసిన వర్షానికి మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమన్నారు.

- Advertisement -

వర్షాల కారణంగా లోతట్టుప్రాంతాలు మునిగిపోగా.. వారి కోసం 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 8,364 మందికి అక్కడకు తరలించినట్లు తెలిపారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యం, నిత్యవసరాలు, ప్రతి ఇంటికీ రూ. 2500 వాలంటీర్ల ద్వారా అందజేశామని, అందని వారికి వాలంటీర్లే వచ్చి ఇస్తారన్నారు. నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పంట నష్టం గురించి కూడా ఎవరూ బాధపడొద్దని ఆదుకుంటామని తెలిపారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తామన్నారు. అలాగే స్వర్ణముఖిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతామన్నారు.

- Advertisement -

హై లెవల్ బ్రిడ్జి కట్టేందుకు రూ.30 కోట్లు ఖర్చవుతుందని.. తక్షణమే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. జిల్లాలో 110 ట్యాంకులు ఉండగా.. వాటిలో కొన్నిచోట్ల బ్రీట్చ్ అయ్యాయన్నారు.త్వరలోనే రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలుపెడతామన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ సంక్షేమ పదకం అందకపోయినా వెంటనే 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. కలెక్టర్ చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News