Big Stories

Revanth Reddy Delhi Tour : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా..

Share this post with your friends

Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాల్కాజ్ గిరి నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తాజాా తెలంగాణ ఎన్నికల్లో కొండగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తన కేబినెట్ లోని మంత్రులకు శాఖల కేటాయింపు, మిగిలిన మంత్రి వర్గశాఖల భర్తీపై చర్చిస్తారు. రేవంత్ రెడ్డి టూర్ తర్వాత మంత్రుల శాఖలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News