Big Stories

Employer beats Dalit | వేతనం అడిగినందుకు దళిత యువకుడి నోట్లో చెప్పులు పెట్టి..

Employer beats Dalit | వేతనం అడిగినందుకు ఒక దళిత యువకుడిని దారణంగా చావగొట్టారు. అతని నోట్లో చెప్పులు కుక్కి.. పెద్ద బెల్టుతో వీపంతా రక్తం వచ్చేలా కొట్టారు. కింద పడేసి బూటు కాళ్లతో 12 మంది తొక్కారు. ఇదంతా చేయమని చెప్పింది ఒక మహిళా ఓనర్. ఈ ఘటన ప్రధాన మంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్‌‌లో జరిగింది.

- Advertisement -

గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలో లేడీ డాన్ రాణిబా అని ఒక మహిళా వ్యాపారవేత్త చాలా ఫేమస్. అమె అసలు పేరు విభూతి పటేల్. సోషల్ మీడియాలో ఆమె చాలా పాపులర్. అయితే కొన్ని రోజుల ముందు ఆమె కంపెనీ రాణిబా ఇండస్ట్రీస్‌లో పనిచేసే ఒక దళిత యువకుడు తనకు రావాల్సిన వేతనం ఇవ్వాలని సంస్థ మేనేజర్‌ని అడిగాడు. ఆ మేనేజర్ ఇప్పుడిచ్చేది లేదు.. తరువాత రమ్మన్నాడు. చాలా రోజులుగా ఈ తతంగం ఇలానే నడుస్తోంది. దీంతో ఆ యువకుడు తనకు రావాల్సిన డబ్బు ఈ రోజే ఇవ్వాల్సిందిగా గట్టిగా అడిగాడు. ఆ సమయంలో కంపెనీ ఓనర్ రాణిబా విభూతి పటేల్ అనుకోకుండా అక్కడికి వచ్చింది. విషయం తెలుసుకొని ఆ యువకుడిని చావగొట్టమని ఆదేశించింది.

- Advertisement -

తక్కువ కులం అయినా.. వారితో వాగ్వాదం చేసినందుకు అతని నోట్లో చెప్పులు పెట్టి తన్నాలని హుకుం చేసింది. దీంతో ఆమె నమ్మినబంట్లు ఆ దళిత యువకుడిని బంధించి అతని నోట్లో చెప్పు పెట్టి బెల్టుతో విపరీతంగా కొట్టారు. వీపంతా రక్తం కారేలా బాది మళ్లీ కింద పడేసి తన్నారు. ఈ ఘటన తరువాత ఆ యువకుడిని కొందరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులకు ఆ యువకుడు జరిగినదంతా వివరిస్తూ ఫిర్యాదు చేశాడు.

పోలీసులు రాణిబా విభూతి పటేల్ సహా ఆరుమందిపై SC అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు రాణిబాను అరెస్టు చేసేందుకు వెళ్లగా.. ఆమె పరారీలో ఉందని తెలిసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News