Big Stories

Vote For Change : ఒక్క ఓటే అనుకోవద్దు.. సోదరా…!

Vote For Change

Vote For Change : ఓటు… ప్రజాస్వావ్యు వ్యవస్థలో వజ్రాయుుధం. అపార బలమున్న బ్రహ్మాస్తం. పౌర ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపాడే రెండక్షరాల తారకమంత్రం.
చేతిలో ఆయుుధం ఉంటే చాలదు. దాన్ని సరైన టైమ్‌లో ఒడుపుగా వాడగలగాలి.
ఈరోజు సరిగ్గా అలాంటి అవకాశమే మనకు వచ్చింది. ఐదేళ్ల పాటు మన పాలకులెవరో మనమే నిర్ణయించే రోజు ఇది.
ఈ ఒక్క రోజు సాకులన్నీ పక్కన పెడదాం. ఇంటిల్లిపాదీ కలిసి సరైనవారికి ఓటేసి వద్దాం. మనమంతా శాసనకర్తలమేనని, మనం ఓటూ ఫలితాన్ని శాసిస్తుందని గుర్తుపెట్టుకుందాం. 100% పోలింగ్‌తో కొత్త చరిత్ర సృష్టిద్దాం.
నా ఒక్క ఓటు పడకపోతే ఏవువుతుందనే ఆలోచనే వద్దు. ఒక్కో బిందువూ కలిస్తేనే సింధువు. ఒక్క ఓటు ఏమి చేయగలదో ఇప్పటికే చరిత్ర నిరూపించింది.

- Advertisement -

ఇవిగో ఉదంతాలు..
1999లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతోనే.
1649లో ఇంగ్లాండ్‌ రాజు కింగ్ చార్లెస్‌-1 శిరచ్ఛేదంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..
1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్‌ రాజు సింహాసనం అధిష్ఠించారు.
1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్‌ అధికారిక భాష అయింది.
1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది
1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ ఒక్క ఓటుతో పదవి పోయింది.
1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్‌ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.
2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్‌ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.
2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటుతో ఓడిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషినాథ్ సీఎం కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్‌ ఓటేయలేదు.
2016 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో జాంబాగ్‌ డివిజన్‌లో తెరాస అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్లు తేడాతో విజయం సాధించారు.

- Advertisement -

పదండి… ఓట్ల పండుగను
విజయవంతం చేసేందుకు బయల్దేరదాం…
పదండి… ఓటేసి గెలుద్దాం…

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News