Jairam Ramesh Counter to BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందా? ఇంతకీ కమలం పార్టీకి ఆ సత్తా ఉందా? కేవలం ఎన్నికల్లో ప్రత్యర్థులను భయపెట్టడానికే ఆ నినాదం ఇచ్చిందా? అసలు సౌత్‌లో బీజేపీ ఉనికే లేదు. అలాంటప్పుడు అన్ని సీట్లు ఎలా వస్తాయన్నది కాంగ్రెస్ ప్రశ్న. దీనికి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది కాంగ్రెస్. లెక్కలతో సహా విడమరిచి చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్‌రమేష్.
ప్రస్తుతం బీజేపీ నినాదం ఒక్కటే. నాలుగు వందల సీట్లు గెలవడమే లక్ష్యం. ఏ ప్రాంతంలో సభలు పెట్టినా ప్రధాని నరేంద్రమోడీ మొదటగా చెప్పే మాటే ఇది. బీజేపీ స్లోగన్‌పై కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ముఖ్యంగా రాహుల్‌గాంధీ ఓ అడుగు ముందుకేసి కేవలం ఈవీఎంల వల్ల మాత్రమే బీజేపీ నాలుగు వందల సీట్లు సాధ్యమన్నారు. అంత కచ్చితంగా చెబుతున్నారంటే కారణం అదేనని అన్నారు కూడా.
ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వంతైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్లోగన్ చిట్టాను బయటపెట్టారు. బీజేపీ సీట్ల నినాదం ఎప్పుడిచ్చినా ఆ పార్టీ అమాంతంగా సీట్లు తగ్గిన సందర్భాలు న్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో గుజరాత్ మొదలు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమలనాధులు ఇచ్చిన నినాదాలను బయటపెట్టారు. ఈ లెక్కన లోక్‌సభ ఎన్నికల్లో వారి లెక్క తప్పడం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. జైరామ్ లెక్కలు చూస్తుంటే నిజమేనన్న భావన చాలా పార్టీల్లో కూడా వ్యక్తమవుతోంది.
Also Read: దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్..!
#WATCH | Delhi: On BJP's '400 paar' slogan, Congress' General Secretary in-charge of Communications Jairam Ramesh says, "In the 2017 Gujarat election, BJP's slogan was '150 paar', seats secured 99. In the 2018 Chhattisgarh election, the slogan was '50 paar', and the seats secured… pic.twitter.com/FmZHYHdW9n
— ANI (@ANI) April 9, 2024