E-Paper
Advertisement

Love Mouli Trailer: నవదీప్ బోల్డ్ కంటెంట్.. అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందే..!

Love Mouli Trailer: నవదీప్ బోల్డ్ కంటెంట్.. అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందే..!
Advertisement
Love Mouli Trailer
Love Mouli Trailer

Hero Navdeep’s Love Mouli Trailer Released: యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారాడు. ఈ ఏడాదిలో వచ్చిన హిట్ సినిమాల్లో నవదీప్ కనిపించాడు. ఇక చాలాకాలం తరువాత నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో నవదీప్ సరసన పంఖురి గిద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా నవదీప్ బోల్డ్ గా, నగ్నంగా నిలబడిన పోస్టర్ అప్పట్లో పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లోనే కాకుండ ట్రైలర్ లో కూడా బోల్డ్ కంటెంట్ ను గట్టిగానే నింపినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా నవదీప్ లుక్ చూస్తుంటేనే వైల్డ్ అనిమల్ లా కనిపిస్తున్నాడు.

Advertisement

మౌళి అనే కుర్రాడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. అతడి ప్రేమ ఎలా ఉంటుంది.. అసలు అతడికి ఎలాంటి అమ్మాయి కావాలి. ఎందుకు అంత వైల్డ్ గా ఉంటున్నాడు.. ? అసలు ఎందుకు అమ్మాయిలందరూ మౌళిని వదిలేసి వెళ్తున్నారు లాంటి సీన్స్ ను ట్రైలర్ లో చూపించారు. అస్సలు ప్రేమ అనేదే లేని ఒక కుర్రాడి జీవితంలోకి ప్రేమ వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ కుర్రాడు ఎలా మారాడు.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది.

Also Read: Ntr – War 2: ఎన్టీఆర్ నాన్నగా జగపతి బాబు.. క్లారిటీ వచ్చేసిందిగా.. వీడియో వైరల్

Advertisement

నాలుగు నిముషాలు ఉన్న ఈ ట్రైలర్ లో ముగ్గురు హీరోయిన్లు.. మౌళితో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ముగ్గురులో మౌళి తనను అర్ధం చేసుకొని ప్రేమించే అమ్మాయిని ఎలా వెతికి పట్టుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో నవదీప్ లుక్, యాటిట్యూడ్ చూస్తుంటే అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నవదీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×