BigTV English

India – China boarder issue : సరిహద్దులో చైనా స్నేహ హస్తం.. డ్రాగన్ కుయుక్తుల్ని నమ్మొచ్చా..?

India – China boarder issue : సరిహద్దులో చైనా స్నేహ హస్తం.. డ్రాగన్ కుయుక్తుల్ని నమ్మొచ్చా..?

India – China boarder issue : చైనా – భారత్ సరిహద్దులోని డెప్సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మొహరించిన భారత్ – చైనా దళాలు క్రమంగా అక్కడి నుంచి వెనక్కు మళ్లుతున్నాయి. రెండు దేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటు చేసుకున్న శిబిరాలను తొలగించి, సైనిక దళాల్ని వెనక్కి తరలిస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయ్యిందని ప్రకటించిన రక్షణ వర్గాలు.. ఒప్పందం మేరకు రెండు వైపుల పురోగతి ఉందా.? లేదా.? అని పరస్పరం సమీక్షించుకుంటున్నట్లు వెల్లడించాయి.


దాదాపు నాలుగేళ్ల నాటి ఉద్రికత్తలకు ఇటీవల ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్ బ్రిక్స్ వేదికగా చర్చించుకుని పరిష్కారం దిశగా అడుగులు వేశారు. అగ్రనేతస సమావేశం తర్వాత సరిహద్దులో శాంతి, స్థిరత్వం ఉండేలా చూడటం మా ప్రాధాన్యత అని దేశాధినేతలు ప్రకటించారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవంతో ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. వీరి నిర్ణయాల మేరకు సైనిక దళాల మధ్య వరుస సమీక్షలు, సమావేశాలు జరిగాయి. వాటిలో నిర్ణయించుకున్న మేరకు క్రమంగా నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అగ్ర నాయకుల నిర్ణయం మేరకు అక్టోబర్ 29వ తేదీని.. ఇరువైపుల సైన్యం ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించుకుని పనిచేస్తున్నారు.

ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతాల నుంచి సైనిక దళాలు పూర్తి స్థాయిలో వెనకకు వచ్చినా, కొన్నాళ్ల పాటు పెట్రోలింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఒకరిపై ఒకరు నమ్మకంతో పెట్రోలింగ్ చేపట్టాలని, ఏవైనా అనుమానాలు తలెత్తినా, అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరిగినా చర్చించుకుని పరిష్కరించుకునేలా అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు. అలానే.. ఇరు దేశాల రక్షణ వర్గాలు ఆన్-గ్రౌండ్ మిలటరీ కమాండర్ల స్థాయి సాధారణ సమావేశాలను కొనసాగిస్తారని ప్రకటించాయి. 2020కి పూర్వ స్థితిలో సైనిక మోహరింపులు చేసేందుకు, ప్రస్తుత భారీ సైనిక మోహరింపుల్ని విరమించుకునేందుకు అక్టోబర్ 29 తేదీని చివరి రోజుగా నిర్ణయించుకుని సైనికాధికారులు పనిచేస్తున్నారు.


2020 మే, జూన్ నెలల్లో పాంగోంగ్ సరస్సు, గాల్వాన్ ప్రాంతాల్లో చైనా – భారత్ సైనికులు వాగ్వివాదాలకు దిగారు. ఇది ఘర్షణాత్మకంగా మారడంతో హింసాత్మక ఘర్షణ తలెత్తాయి. ఈ ఘటనలో రెండు వైపులా భారీగా సైనికులు మరణించారు. దాంతో.. సైనిక ఘర్షణ తీవ్రమై, దౌత్యపరమైన ఉద్రిక్తతకు కారణమయ్యాయి. వీటికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు కొద్ది రోజుల క్రితం ఒక పెట్రోలింగ్ ఒప్పందాన్ని అంగీకరించాయి.

చైనా, భారత్ ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఇన్నాళ్లు భారీ శిబిరాలు, సైనిక వాహనాలు కదలికలు పెద్దఎత్తున కనిపిస్తుండేవి.. కానీ, ఇటీవల కొన్ని జాతీయ సంస్థలు సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో రెండు వైపుల సైనిక గుడారాలను కూల్చివేసి, భద్రతా దళాల వాహనాలను తరలిస్తున్నట్లు స్పష్టమైంది.

ప్రస్తుతం ఇరు దేశాలు విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. అయితే.. ప్రస్తుత మోహరింపులు ఉపసంహరించుకున్నాక.. భారత సరిహద్దుల రక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై మరింత లోతుగా చర్చించి, నిర్ణయిస్తామని ప్రకటించారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×