106 Employees Suspended In Siddipet: ఇటీవల మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం మారినా ఆ ఉద్యోగులకు.. గత పాలకుల మీద మక్కువ తగ్గనట్లుంది. అందుకే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసి కూడా రాజకీయ సమావేశాలకు హాజరయ్యారు.
వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించిన విషయం బహిర్గతం అయ్యింది. దీంతో వెంకట్రామిరెడ్డి, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఉద్యోగుల విషయంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: కవితకు కలిసిరాని కొత్త సంవత్సరం, పొలిటికల్ కేసంటూ వ్యాఖ్యలు!
సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులలో 69 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉండగా.. 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు ఉన్నారు.