BigTV English

Army Use AI Jammu Kashmir: ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం.. అఖ్‌నూర్ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే?..

Army Use AI Jammu Kashmir: ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం.. అఖ్‌నూర్ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే?..

Army Use AI Jammu Kashmir| జమ్ము కశ్మీర్ లోని అఖ్నూర్ ప్రాంతంలో సోమవారం అక్టోబర్ 28, 2024న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఈ ఎన్‌కౌంటర్ చేయడానికి ఇండియర్ ఆర్మీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుందని మంగళవారం విడుదల చేసిన ఎన్‌కౌంటర్ రిపోర్ట్ లో పేర్కొంది.


ఉగ్రవాదుల వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని సమాచారం రావడంతో ఇండియన్ ఆర్మీ వారిని అదుపు చేయడానికి చాలా జాగ్రత్తగా ఈ ఎన్‌కౌంటర్ ప్లాన్ చేసినట్లు ఈ రిపోర్ట్‌లో తెలిపింది. అఖ్నూర్ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మేజన్ జెనెరల్ సమీర్ శ్రీవాస్తవ మీడియా బ్రీఫింగ్ లో మాట్లాడుతూ.. “మేము ఉగ్రవాదుల లొకేషన్ తెలసుకునేందుకు ముందుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మానవులు లేని ఒక ఆర్మీ వాహనాన్ని ఆ ప్రాంతంలోకి పంపించాం. దీంతో చాలా త్వరగా వారి ఆచూకీ తెలుసుకోవడంలో విజయం సాధించాం. కానీ వాహనంతో పాటు ఆర్మీ కుక్క ఫాంటమ్ కూడా వెళ్లింది. మిలిటెంట్లు వాహనం, కుక్కపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనతో ఫాంటమ్ తన ప్రాణాలు త్యాగం చేసింది.

Also Read:  సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం


ఏఐ టెక్నాలజీ వల్ల, ఫాంటమ్ బలిదానం వల్ల చాలా మంది భారత సైనికులు ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగాం. ఆర్మీ డాగ్ ఫాంటమ్ (4) శరీరంలో బుల్లెట్లు దూసుకుపోయినా అది చివరి వరకు పోరాడింది. కానీ చికిత్స అందించే లోపే అది మరణించింది. ఈ ఎన్‌కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ బిఎంపి వాహనం (ట్యాంక్) ఉపయోగించామని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే. ఎందుకంటే ఆ ప్రాంతమంతా దట్టమైన అడువులు, సాధారణ వాహనాలతో ఆ ప్రాంతంలో వెళ్లడం సురక్షితం కాదు. ఉగ్రవాదులు దాగి ఉన్న లొకేషన్ తెలసుకున్నాక మేము బిఎంపి ట్యాంక్ ఉపయోగించాం.” అని చెప్పారు.

ముగ్గురు ఉగ్రవాదులు హతం
సోమవారం జమ్ము కశ్మీర్ లోని అఖ్నూర్ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు ఒక ఆస్పత్రి యాంబులెన్స్ పై కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న భారత సైన్యం వారిని పట్టుకోవడానికి ప్లాన్ చేసింది. కానీ వారి వద్ద తుపాకులు, బాంబులు పెద్ద మొత్తంలో ఉన్నాయని సమాచారం రావడంతో ఎన్‌కౌంటర్ ప్లాన్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామస్తులు ఉగ్రవాదుల గురించి ఇండియన్ ఆర్మీకి సమాచారం అందించడంతోనే ఎన్‌కౌంటర్ విజయవంతమైందని మేజర్ జెనెరల్ శ్రీవాస్తవ తెలిపారు.

ఉగ్రవాదుల లొకేషన్ కు సమీపంగా ఆర్మీ వెళ్లగానే వారు కాల్పులు చేయడం ప్రారంభించారు. ఆర్మీ చేసిన ఎదురు కాల్పుల్తో వారంతా మరణించారు. అయితే వారి వద్ద భారీ సంఖ్యలో తుపాకులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయని, అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు చూసి.. ఏదో పెద్ద పేలుడు చేయడానికే వారంతా అక్కడికి వచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

అంతకుముందు ఈ ఉగ్రవాదులు బత్తల్ ప్రాంతంలో కూడా ఆర్మీ కాన్వాయ్ పై దాడులు చేశారు. అప్పటి నుంచి వీరికోసం వెతుకుతూ చేసిన ఆపరేషన్ అసన్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్ అసన్ లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×