Big Stories

Dharani Portal | ధరణి పోర్టల్‌పైనే సిఎం రేవంత్ గురి.. త్వరలోనే భూ కబ్జాల బాగోతాలు బయటికి..

Dharani Portal | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వెనెవెంటనే ఇచ్చిన హామీలలో రెండింటిని అమలు చేశారు. ఆ తరువాత ఉచిత విద్యుత్, రైతులకు నిరంతరాయ విద్యుత్ హామీలను అమలు చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. కానీ ఆ తరువాతే అసలు పని మొదలవబోతోంది. అదే ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూకబ్జాల బాగోతాలు వెలితీయడం.

- Advertisement -

బిఆర్ఎస్ ప్రభుత్వంలో వేల ఎకరాల భూమిని ధరణి పోర్టల్‌ ద్వారా అక్రమార్కులు ఆక్రమించుకున్నారునే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. భూకబ్జాలకు పాల్పడిన అక్రమార్కులకు కొందరు ఐఎఎస్ అఫీసర్లు సహాయం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్‌పై సమీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరు బిఆర్ఎస్ నేతలు, మంత్రులు ధరణి పోర్టల్‌ని అడ్డం పెట్టుకొని భూకబ్జాలు చేసిన వ్యవహారాలని బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణని ఇప్పటికే సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భూకబ్జాలు చేసేందుకు సహాయం చేసిన అధికారులపై కఠినమైన చర్యలుంటాయని తెలిసింది.

- Advertisement -

ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి మెరుగైన భూ పరిపాలన కోసం భూమాత పోర్టల్‌ను ప్రవేశ పెడతామని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇందుకోసం శాస్త్రీయ అధ్యయనం తప్పనిసరి అని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత మెరుగైన వ్యవస్థ రూపకల్పనకు ముందుగా ప్రక్షాళన చేస్తున్నట్లు రెవెన్యూ అంశాల్లో సలహాదారుడిగా ఉన్న సినియర్ అధికారి వివరించారు.

అయితే ధరణి పోర్టల్లో ఎలాంటి తప్పులు లేవని ధీమాగా చెప్పిన బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ సవరణల పేరుతో 33 మాడ్యూళ్లు ఎందుకు చేసింది? వాటి వల్ల ఎవరికి లాభం కలిగింది? సామాన్యులు ఎలా నష్టపోయారు? అనే ప్రశ్నల నుంచి ప్రక్షాళన జరుగుతుందని సమాచారం. ఇందులో ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని కేవలం నష్టపోయిన రైతులకు, సామాన్యులకు న్యాయం చేకూర్చేందుకే రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని ఆ సీనియర్ అధికారి తెలిపారు.

ధరణి పోర్టల్ వెనుక మాజీ సియస్

ధరణి పోర్టల్ రూపకల్పన, అమలులో అసలు వ్యక్తి అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌. ధరణి వ్యవస్థపై లక్షలాదిగా వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా ఆదాయ మార్గాలను వెతకడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. బిఆర్ఎస్ నాయకులు, మాజీ సిఎం కేసిఆర్ ధరణి పోర్టల్ ఓ అద్భుతమని కీర్తించేవారు.

బిఆర్ఎస్‌కు అనుకూలంగా కొందరు జిల్లా కలెక్టర్లు నైతిక విలువలు మరిచి పనిచేశానే ఆరోపణలున్నాయి. కోర్టుల్లో భూకబ్జా కేసులు ఒకవైపు నడుస్తుండగానే మరోవైపు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఎన్వోసీలు జారీ చేశారు ఇదంతా. బిఆర్ఎస్ నాయకుల ప్రశంసలందుకోవడానికేనని చెబుతున్నారు. అలాగే ఈ అధికారులు కూడా పనిలోపనిగా బిఆర్ఎస్ నాయకులతోపాటు ఇతర బడాబాబులకు కూడా భూకబ్జాల విషయంలో సహకరించి బాగానే వెనకేసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా ధరణి పోర్టల్ దందా బిఆర్ఎస్ నాయకులకు, భూకబ్జా అక్రమార్కులకు, అవినీతి అధికారులకు లాభసాటిగా జరిగిందనేది వాస్తవం.

ఇలాంటి అవినీతి అధికారులు 10 మందికి పైగా ఉన్నారని.. వారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు.. నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఖరీదైన భూములు చేతులు మారాయి. హైదరాబాద్ నగర శివార్లలో ప్రధానంగా ఇలాంటి లావాదేవీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో క్లాసిఫికేషన్ మార్పు కోసం కొన్ని ఫైళ్లు కదిలాయి. ఇందులో కొన్ని వందల ఎకరాల వక్ఫ్ భూమిని పట్టాగా మార్చారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు సిసిఎల్ఎలో దీనిపై పెద్ద చర్చ జరిగింది.

తహసీల్దార్లు, కలెక్టర్లకు తెలియకుండానే ఉన్నత స్థాయిలో ఫైళ్లు క్లియర్ చేసి డిజిటల్ సంతకాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇదంతా ఉన్నత స్థాయి వ్యక్తులు క్లియరెన్స్‌ కోసంమౌఖిక ఆదేశాల ద్వారా పనులు చేయించినట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలపై రేవంత్ సర్కార్ సీరియస్‌గా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News