Big Stories

AUS vs PAK : ఊరు మారినా రాత మారలేదు .. పాకిస్తాన్ కి ఘోర అవమానం..

AUS vs PAK : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ కు ఘోర అవమానం జరిగింది. టెస్ట్ మ్యాచ్ లకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన స్కోరు బోర్డు కింద వచ్చే టిక్కర్ లో పాకిస్తాన్ పేరు తప్పుగా వచ్చింది. అది రేసిజమ్ కిందకు వస్తుందని నెట్టింట భగ్గుమని మంటలు లేచాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

- Advertisement -

ఇప్పటికే వన్డే ప్రపంచకప్ 2023 లో ఓటమితో ఇంటా బయటా అవమానాలతో పాకిస్తాన్ చితికిపోయి ఉంది. నెమ్మదిగా తేరుకొని తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక ఇలా జరగడంతో ఊరు మారినా రాత మారలేదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

డిసెంబరు 14 నుంచి ఆస్ట్రేలియా-పాక్ మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఒకవైపు ఆస్ట్రేలియాలో వార్నర్-జాన్సన్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి తోడు, ఇప్పుడిలా పాకిస్తాన్ పేరు తప్పుగా రావడంతో, ఇదేదో ఈ సిరీస్ కి ముహూర్తం బాగున్నట్టు లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…టెస్ట్ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్  వార్మప్ మ్యాచ్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కు ఘోర అవమానం ఎదురైంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న టీవీ స్క్రీన్ ల కింద వచ్చే టిక్కర్ లో అసలు సమస్య ఎదురైంది.

ఇంతకీ ఏం వచ్చిందంటే పాకిస్తాన్ పేరు ఇంగ్లీషులో  షార్ట్ కట్ లో  PAK అని రాస్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే PAKI అని వచ్చింది.  అంటే అక్కడ మూడక్షరాలుంటే, ఇక్కడ నాలుగున్నాయి. ఇందులో తప్పేం ఉందని అనుకోండి. ఇక్కడే మీనింగ్ మారిపోయి, కొంపలు అంటుకుపోయాయి.

పాక్ పేరు తప్పుగా రావడం గమనించిన ఒక రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.  పాకిస్తాన్ లేదా దక్షిణాసియా జాతీయులను ఇంగ్లాండ్‌లో పాకీ (PAKI) అని సంభోదిస్తుంటారు. ఇదొక అవమానకరమైన పేరు అన్నమాట. వారిని కించపరిచేందుకు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పదాలు వాడకూడదనే నిబంధనలు కూడా ఉన్నాయి.

ఇది రేసిజం అంటే జాతి వివక్ష కిందకు వస్తుందని,  పాకిస్తాన్ ని అవమానిస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

 అప్పటికే విషయం తెలిసిన పాక్ క్రికెటర్లు చాలా ఇబ్బంది పడుతూ, అసహనంగా కనిపించారు. దీంతో పొరపాటు గమనించిన క్రికెట్ ఆస్ట్రేలియా వెంటనే రంగంలోకి దిగింది. ఇది కావాలని జరిగింది కాదు, టెక్నికల్ మిస్టేక్ అని తెలిపి, పాకిస్తాన్ కు క్షమాపణలు చెప్పింది. దీంతో వివాదం నెమ్మదిగా సద్దు మణిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News