Big Stories

Cashew Exports : మరిన్ని దేశాలకు మన జీడిపప్పు

Cashew Exports

Cashew Exports : జీడిపప్పు ఉత్పత్తి, ఎగుమతుల్లో మనది రెండో స్థానం. మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలని సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా బంగ్లాదేశ్, ఖతర్, మలేసియా, అమెరికాలకు షిప్ మెంట్లను పంపే ప్రక్రియకు అపెడా(అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడ్సక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ) శ్రీకారం చుట్టింది.

- Advertisement -

కొత్త మార్కెట్ల అన్వేషణ, జీడిపప్పు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని అపెడా కృషి చేస్తోంది. అధికంగా కాజు ఉత్పత్తి, ఎగుమతులు చేస్తున్న దేశం ఐవరీ‌కోస్ట్ తర్వాత మనదే. గ్లోబల్ కాజు మార్కెట్‌లో 15 శాతం వాటా భారత్‌దే.

- Advertisement -

ఇప్పటివరకు యూఏఈ, నెదర్లాండ్స్, జపాన్, సౌదీ అరేబియా దేశాలకు మన దేశం నుంచి జీడిపప్పు పంపుతున్నారు. వీటిలో యూఏఈ, నెదర్లాండ్స్‌ దేశాలకు ఎగుమతులు మరీ ఎక్కువ. బ్రిటన్, స్పెయిన్, కువైత్, యూరప్ దేశాల మార్కెట్లలోనూ పట్టు సంపాదించేందుకు అపెడా కృషి చేస్తోంది.

దేశంలో ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జీడిపప్పు అత్యధిక మొత్తంలో ఉత్పత్తి అవుతోంది.ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7.92 లక్షల టన్నుల ఉత్పత్తితో ఐవరీ కోస్ట్ అగ్రభాగాన ఉంది. భారత్‌లో కాజు ఉత్పత్తి 7.43 లక్షల టన్నుల వరకు ఉంది.

ఇక వియత్నాంలో 2.83 లక్షల టన్నులు, బురుండీలో 2.83 లక్షల టన్నులు, ఫిలిప్పీన్స్ 2.42 లక్షల టన్నులు, టాంజేనియాలో 2.25 లక్షల టన్నుల జీడి పప్పు ఉత్పత్తి జరుగుతోంది. బెనిన్‌లో 2.04 లక్షల టన్నులు, మాలిలో 1.67 లక్షల టన్నులు, బ్రెజిల్‌లో 1.38 లక్షల టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News