BigTV English
Advertisement

Mansoor Ali Khan | చిరంజీవి, త్రిషలపై పరువునష్టం దావా వేస్తా : మన్సూర్ అలీ ఖాన్

Mansoor Ali Khan | త‌మిళ సినీ రంగానికి చెందిన న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష‌, ఖుష్బూ పై నిప్పులు చెరిగారు. ముగ్గురిపై ప‌రువు న‌ష్టం, క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామంటూ ఆరోపించారు. మాన‌సికంగా హింసించ‌డంపై కేసులు వేస్తున్నట్లు తెలిపారు.

Mansoor Ali Khan | చిరంజీవి, త్రిషలపై పరువునష్టం దావా వేస్తా : మన్సూర్ అలీ ఖాన్

Mansoor Ali Khan | త‌మిళ సినీ రంగానికి చెందిన న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష‌, ఖుష్బూ పై నిప్పులు చెరిగారు. ముగ్గురిపై ప‌రువు న‌ష్టం, క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామంటూ ఆరోపించారు. మాన‌సికంగా హింసించ‌డంపై కేసులు వేస్తున్నట్లు తెలిపారు.


కొంద‌రు త‌న వ్యాఖ్యల‌ను వ‌క్రీక‌రించారంటూ వాపోయాడు. వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారంటూ ఆరోపించారు. త్రిష‌పై అస‌భ్యక‌రంగా మాట్లాడిన‌ట్లు చిత్రీక‌రించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వీరి వ‌ల్ల తాను మాన‌సికంగా ఇబ్బంది ప‌డ్డాన‌ని వారిపై ప‌రువు న‌ష్టం , క్రిమిన‌ల్ కేసు దాఖ‌లు చేస్తున్నట్లు మ‌న్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ముంద‌స్తు త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ మ‌న్సూర్ అలీఖాన్ కోర్టును ఆశ్ర‌యించారు.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పై త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కాంట్రవర్సీపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. మన్సూర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన్సూర్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ త్రిషకు మద్దతు ప్రకటిస్తున్నారు. మన్సూర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సీనియర్‌ హీరోయిన్‌ కుష్భూ అయితే ఏకంగా మహిళా కమీషన్‌ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. టాలీవుడ్‌ నుంచే ఇప్పటికే హీరో నితిన్‌ ఈ వివాదంపై స్పందిస్తూ.. త్రిషకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా త్రిష-మన్సూర్‌ వివాదంపై ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు.


అసలు ఏం జరిగిదంటే లోకేశ్‌ కనగరాజ్‌-విజయ్‌ కాంబోలో వచ్చిన లియో చిత్రంలో మన్సూర్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించాడు. అందులో త్రిష హీరోయిన్‌. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మన్సూర్‌ మాట్లాడుతూ.. గతంలో నేను ఎన్నో రేప్‌ సీన్లలో నటించాను. లియో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతో కూడా రేప్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే.. నాకు అలాంటి సన్నివేశం లేదు. అందుకు బాధగా ఉంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు చిరంజీవి . ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ మహిళపై చేసినా అసహ్యంగా ఉంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయిపై చేసినా నేను ఖండిస్తూ.. మహిళలకు అండగా, సపోర్ట్ గా నిలబడతా అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×