KCR : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉండే.. బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉండే అనేది ప్రజలు గుర్తుచేసుకోవాలని ఆయన అన్నారు. 2004 లో కాంగ్రెస్ పార్టీతో పోతు పెట్టుకున్న విషయాన్నీ గుర్తుచేశారు. కరీంనగర్ ఉపఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వరద కాలువకు తూములు పెట్టలేదని విమర్శించారు. కానీ బీఆర్‌ఎస్ పాలనలో అలా జరగలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలది అవకాశవాదం అని పేర్కొన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వెయ్యాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన చాల గొప్పగా ఉందని తెలిపారు. కులాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ఓట్లు వెయ్యాలని ఆయన ప్రజలను కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులని గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా నలుపేందో.. తెలుపేందో తెల్సుకొని ఓటు వెయ్యాలని ఆయన జగిత్యాల ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పాలనలో రూ. 200 పెన్షన్ ఇచ్చేవారు కానీ దానిని రూ. 2000 చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే పెన్షన్ రూ. 5000 కు పెంచుతాం అని తెలిపారు. ఈ ప్రసంగంలో తమ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన తీసుకొచ్చారు.సంక్షేమ కార్యక్రమాలు ఇలానే కొనసాగాలంటే జగిత్యాలలో సంజయ్ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.కత్తి ఒకనికిచ్చి ఉద్యమం ఇంకొకన్ని చేయమంటే ఎట్లా అని కేసీఆర్ సెటైర్లు వేశారు. జగిత్యాలలో ఎవరు గెలిస్తే ప్రభుత్వంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.