Big Stories

Curd : పెరుగుతో పాటు ఇవి తింటే ఏమవుతుందో తెలుసా

Curd : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ భోజనంలో పెరుగును తీసుకుంటారు. ఇక మరికొందరైతే పెరుగులో అనేక రకాల పదార్థాలను వేసి లాగించేస్తుంటారు. అయితే పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పెరుగులో తేనె కలుపుకొని తింటే జీర్ణాశయంలో ఉండే అల్సర్లు నయమవుతాయి. జీలకర్ర పొడిని కొద్దిగా తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు వేసుకొని తింటే అధిక బరువు తగ్గుతారు. నల్ల ఉప్పును పొడిచేసి దాన్ని కొద్దిగా పెరుగులో కలుపుకుని తింటే గ్యాస్, యాసిడిటీ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో షుగర్ కలుపుకొని తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వడదెబ్బకు గురైనవారు, బాగా వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు తింటే కోల్పోయిన శక్తి మళ్లీ లభిస్తుంది. అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వేడి తగ్గి మూత్రం కూడా సులువుగా వస్తుంది. పసుపు, కొద్దిగా అల్లం రసం తీసుకుని పెరుగులో కలుపుకొని తింటే శరీరానికి పోలిక్ యాసిడ్ అందుతుంది. ఇది చిన్నారులకు గర్భిణీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగులో వాము కలుపుకొని తినడం వల్ల నోటి పూత, దంతాలు, చిగుళ్ల సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. నల్ల మిరియాల పొడిని పెరుగులో కలుపుకుని తింటే మలబద్ధకం తగ్గడంతో పాటు ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. తాజా పండ్లను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పెరుగులో కలుపుకొని తింటే ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పెరుగులో నారింజ రసం కలుపుకొని తింటే శరీరానికి విటమిన్ సి బాగా లభిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News