E-Paper
Advertisement

Suriya’s Kanguva Climax: ఒక్క వార్ సీన్ కోసం 10,000 మంది.. ఇదెక్కడి మాస్ రా మావ..!

Suriya’s Kanguva Climax: ఒక్క వార్ సీన్ కోసం 10,000 మంది.. ఇదెక్కడి మాస్ రా మావ..!
Advertisement

Suriya’s; Kanguva Movie Climax Shooting with 10,000 People: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన సూర్యకు ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. ప్రేక్షకులు, అభిమానులు రచ్చ రంబోలా చేస్తారు. అంతటి క్రేజ్ ఉంది సూర్యకు. అయితే ప్రస్తుతం సూర్య తన కెరీర్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు శివ డైరెక్షన్‌లో ‘కంగువ’ మూవీలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్స్ ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో సూర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్య సరసన ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సూర్య ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతోంది. ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు మేకర్స్ కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. అయితే ఇందులో కేవలం క్లైమాక్స్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.

Also Read: ‘కంగువ’ నుండి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్.. స్టోరీ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది?

Advertisement

ఈ మూవీ క్లైమాక్స్ కోసం కంగువ మూవీ టీం చాలా శ్రమించిందని తెలిపారు. అయితే అది ఒక్క యుద్ధ సన్నివేశమని తెలుపుతూ.. క్లైమాక్స్‌లో వచ్చే ఆ యుద్ధ సన్నివేశానికి న్యాయం చేసేందుకు దర్శకుడు పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ఎందుకంటే ఈ ఒక్క సన్నివేశం కోసం మాత్రమే ఏకంగా 10,000 మందికి పైగా వ్యక్తులను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ యుద్ధ యాక్షన్ సన్నివేశాలు, విన్యాసాలను విజువలైజేషన్ ఇంటర్నేషనల్ నిపుణుల బృందం చాలా జాగ్రత్తగా.. అద్భుతంగా చేసిందని తెలిపారు. దీనిబట్టి చూస్తే ఈ మూవీ ఏ రేంజ్‌లో తెరకెక్కుతుందో అర్థం అవుతోంది. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×