BigTV English

Maida Flour: మైదాతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా.. !

Maida Flour: మైదాతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా.. !

Side Effects Of Maida: మనం రోజు తినే ఆహార పదార్థాల్లో చాలా వరకు మైదా ఉంటుంది. చాలా మంది సాయంత్రం వేళ టీ తాగుతూ బిస్కెట్లు, సమోసాలు, రస్క్ వంటివి తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా మైదాతోనే తయారవుతాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్లు వైద్యులకు సూచించే బ్రెడ్ కూడా మైదాతో తయారవుతుంది.


ఏదో ఒక రకంగా మనం మైదా తింటూనే ఉంటున్నాం. కేక్ తో పాటు బాదుషా, జిలేబి స్వీట్ల వంటివి మైదా లేకుండా తయారు చేయలేరు. పిజ్జా, బర్గర్, నూడిల్స్ కూడా మైదాతోనే తయారవుతాయి. మైదా ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. అది ఎంత వరకు నిజం..మైదాతో చేసిన ఆహార పదార్థాలు ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమలను బాగా పట్టిస్తే మైదా పిండి వస్తుంది. అయితే బ్రౌన్ రంగులో ఉన్న గోధుమల నుంచి తెలుపు రంగు పిండి వస్తుంది. ఇది ఎలా సాధ్యం అనే  ప్రశ్న తలెత్తుతుంది. మైదా తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి బ్రెడ్, బన్, కేక్, బిస్కెట్స్, పరోటా వంటి వాటిని మైదాతో తయారు చేస్తున్నారు. మైదాకు తెలుపు రంగు రావడం కోసం దానిలో బ్లీచ్ ను వాడతారు. బీచ్ అనేది ఆక్సీకరణ ప్రక్రియ. ఈ బ్లీచ్ ప్రక్రియలో క్లోరిన్, బెంజాయిల్, పెరాక్సైడ్ వంటి రసాయనాలు వాడతారు. వీటిని ఎంత వరకు వాడాలి అన్న అంశంపై కొన్ని పరిమితులున్నాయి.


మైదాతో చేసిన ఆహారపదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వీటితో తయారు చేసే పరోటాలలో నూనె ఎక్కువగా వాడతారు. మైదాతో చేసే చోలే భటూరే కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దీనిని నూనెలో వేపుతారు. మైదాలో తయారు చేస్తే బిస్కెట్స్, స్నాక్స్ వంటి వాటిలో చక్కెరను ఎక్కువగా వాడతారు. పిండి పదార్థం అధికంగా ఉండే మైదాకు ఇలాంటివి కలిపితే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

పీచు పదార్థం లేని మైదాతో చేసిన ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకున్నా సరే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఎసిడిటీ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అధిక బరువు ఉన్న మహిళలు మైదాతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. వీటిని తింటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. హార్మోనల్ ఇన్ బ్యాలన్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మైదాతో తయారు చేసిన ఆహార పదార్ధాలు తినడం వీలైనంత తగ్గించుకోవాలి.

Also Read: పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..

మైదాలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మైదా తింటే క్రమంగా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా మైదాలో షుగర్ లెవల్స్ పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. మైదా వల్ల హైబీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

 

 

 

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×