BigTV English

Kangana Ranaut: సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఇక సినిమాల్లో నటించబోనంటూ..

Kangana Ranaut: సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఇక సినిమాల్లో నటించబోనంటూ..

Actress Kangana Ranaut hot Comments: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. తన గెలుపు కోసం ఎంతో శ్రమిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎంపీగా విజయం సాధిస్తే ఇక నుంచి సినిమాల్లో నటించబోనని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయం తెలిసి సినిమా ప్రేక్షకులు, అభిమానులు కొంత నిరుత్సాహపడుతున్నారు.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పలు సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. అయితే, ఆమె తాజాగా రాజకీయ అరంగేట్రం చేసింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేస్తుంది.

బీజేపీ పార్టీ తరఫున కంగనా రనౌత్ బరిలో నిల్చున్నది. ఈ క్రమంలో ఆమె తన గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ ఎన్నికలను ఆమె చాలా సీరియస్ గా తీసుకుంది. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ తనకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను వేడుకుంటుంది. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ కు కంచుకోటగా చెప్పుకునే మండి నుంచి తనని ఎంపీగా గెలిపిస్తే.. తాను బాలీవుడ్ నుంచి తప్పుకుంటాని పేర్కొన్నది.


2024 పార్లమెంటు ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకుని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కంగనా రనౌత్ మరోసారి చర్చల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి, విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులు, అభిమానులు కొంత నిరుత్సాహానికి గురైనా, ఈ ఎన్నికలను ఇంత సీరియస్ గా తీసుకున్న కంగనా రనౌత్ ఎంపీగా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

అయితే, కంగనా తన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నది. తన ఆస్తుల విలువ రూ. 91 కోట్లు అని, అందులో కార్లు, నగలు, స్థిరాస్తులున్నాయని పేర్కొన్న విషయం విధితమే. అదేవిధంగా ఆమెకు రూ. 17 కోట్ల మేర అప్పు ఉన్నదని, ప్రస్తుతం తన వద్ద 62.9 కోట్ల స్థిరాస్తులు, రూ. 28.7 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నట్లు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తను పడుతున్న కష్టాన్ని విరిస్తూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుసగా ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, పర్వత ప్రాంతాల్లో అత్యంత కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలో మీటర్ల ప్రయాణం.. నిద్రలేని రాత్రులు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత తనకు ఓ విషయం అర్థమైందని.. సినిమాలు తీయడం కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టమని ఆమె పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కూడా వైరల్ గా మారింది.

Also Read: మంచి ఉపాయం చెప్పిన ఇస్రో చైర్మన్..

ఇదిలా ఉంటే, కంగనా రనౌత్ నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ ని వాయిదా వేశారు. కంగనా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×