BigTV English

Nithiin’s Thammudu Heroine: నితిన్ ‘తమ్ముడు’కి జోడీ దొరికేసిందోచ్.. ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన బ్యూటీ!

Nithiin’s Thammudu Heroine: నితిన్ ‘తమ్ముడు’కి జోడీ దొరికేసిందోచ్.. ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన బ్యూటీ!

Sapthami Gowda as a Heroine in Nithiin’s Thammudu Movie: సాధారణంగా ఫెల్యూర్స్‌లో ఉన్న హీరోలు తమ తదుపరి సినిమాతో సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. సక్సెస్ ఫార్ములతో మంచి హిట్లు సాధించాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక యంగ్ హీరో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. వరుస సినిమాలు ఫ్లాప్ అయినా.. రూట్ మార్చటం లేదు. మళ్లీ అదే జానర్‌లో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.


అయితే ఆ హీరో మరెవరో కాదు.. వరుసగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి యాక్షన్ సినిమాలతో నిరాస పరిచిన నితిన్. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో తన అప్ కమింగ్ సినిమాతోనూ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములను పక్కన పెట్టి.. పెద్దగా వర్కౌట్ కానీ సినిమా చేస్తున్నాడని కొందరు అంటున్నారు. నితిన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో ఎక్కువగా లవ్ సినిమాలు, కామెడీ ఎంటర్‌ట్రైనర్ సినిమాలే ఉన్నాయి.

అలాంటి సినిమాలే నితిన్‌కి బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ అతడు చేసిన యాక్షన్ సినిమాలు మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అలాంటి సినిమాలు ఈ యంగ్ హీరోకి పెద్దగా కలిసి రాలేదు. మాస్ యాక్షన్ ఫార్మెట్‌లో చేసిన సినిమాలేవి బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయాయి. అయినా మరోసారి మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్‌తో చేస్తున్నాడు. ఈ మూవీ ‘తమ్ముడు’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఈ మూవీ కూడా మాస్ యాక్షన్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: నితిన్ బర్త్‌డే స్పెషల్.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

అయితే ఆ పోస్టర్‌లో ఒక లేడీ లారీ డ్రైవింగ్ చేస్తుంటే.. లోపల కొందరు వ్యక్తులు ఉన్నారు. ఇక ఆ లారీ మీద నితిన్ కూర్చుని ఒక ఆయుధంతో మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ఈ మూవీలో నితిన్‌కి జోడీగా హీరోయిన్‌ దొరికేసిందని తెలుస్తోంది. ముందుగా ఈ మూవీలో హీరోయిన్‌గా రాశిఖన్నా అనుకున్నారు. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది.

‘కాంతార’ సినిమాలో హీరోయిన్‌‌గా నటించిన కన్నడ బ్యూటీ సప్తమి గౌడ.. ఇప్పుడు నితిన్‌కు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతార’తో ఓవర్‌నైట్ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన సప్తమి గౌడకు తెలుగులో కూడా చాలానే ఆఫర్లు వచ్చాయి. అందులో ఇది కూడా ఒకటని తెలుస్తోంది. ఈ మూవీతోనే ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ లయ కూడా రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమె ఇందులో నితిన్‌కు అక్కగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×