IPL 2024 69th Match Sunrisers Hyderabad Vs Panjab Kings Preview: అందరూ అనుకుంటున్నట్టు ఇది మొక్కుబడి మ్యాచ్ మాత్రం కాదు. సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ మధ్య హైదరాబాద్ లో మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే హైదరాబాద్ గెలిస్తే 17 పాయింట్లతో ముందడుగు వేస్తుంది. అప్పుడు రాజస్థాన్ యథాతథంగా తన తర్వాత మ్యాచ్ ఓడిపోతే, ప్లే ఆఫ్ లో టాప్ 2కి వెళుతుంది. ఇది తమకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. లేదు ఓడినా వచ్చిన నష్టమేమీ లేదు. ఉన్న స్థానంలోనే ఉంటుంది.
పంజాబ్ కింగ్స్ టీమ్ సీజన్ అంతా అయిపోయాక చివర్లో టచ్ లోకి వచ్చారు. ఇప్పుడు దుమ్ము దులుపుతున్నారు. కెప్టెన్ ధావన్ లేకపోయినా సరే, ఫటాఫట్ కొడుతున్నారు. ఈ ఊపులో హైదరాబాద్ కి ఝలక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు గెలిచినా పెద్ద ఉపయోగం లేదు. కొంచెం పరువు దక్కుతుంది అంతే అంటున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 22 మ్యాచ్ లు జరిగాయి. హైదరాబాద్ 15 సార్లు విజయం సాధిస్తే.. పంజాబ్ 7సార్లు మాత్రమే గెలిచింది.
హైదరాబాద్ టీమ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. కమిన్స్ కెప్టెన్సీలో వ్యూహాత్మకంగా ఆడిన హైదరాబాద్ ముందడుగు వేసింది. ఒక దూకుడైన ఆటతీరుతో జట్టుని నడిపించిన తీరుని అందరూ అభినందిస్తున్నారు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆడారు. ఇక బౌలింగులో భువనేశ్వర్ ఫామ్ లోకి రావడం జట్టుకి కలిసి వచ్చింది. క్లాసెన్ ఉండనే ఉన్నాడు. నటరాజన్ తదితరులు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.
Also Read: ఓటమితో ముగిసిన ముంబై కథ.. చివరి మ్యాచ్ లో లక్నో గెలుపు
పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా గొప్పగా ఆడుతోంది. ప్రభ్ శిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, శశాంక్ సింగ్ చక్కగా ఆడుతున్నారు. కెప్టెన్ శ్యామ్ కరన్ రాజస్థాన్ తో మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించాడు. బౌలింగులో కూడా రబాడా, చాహర్, హర్షల్ పటేల్ మంచి ఫామ్ లోకి వచ్చి, ప్రత్యర్థులను తక్కువ స్కోరుకి కట్టడి చేస్తున్నారు. మరి రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కానున్నాయో వేచి చూడాల్సిందే.