Big Stories

Ceiling Fan and AC : ఏసీ, ఫ్యాన్.. ఒకేసారి ఉపయోగించొచ్చా..?

fan

- Advertisement -

 

- Advertisement -

Ceiling Fan and AC : సమ్మర్ మొదలైంది. సూర్యుని ప్రభావానికి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు వెళ్తే బరించలేనంతా ఉక్కగా ఉంటుంది. దీంతో చాలా మంచి ఏసీల కింద కూర్చొని చల్లగా రిలాక్స్ అవుతున్నారు. అయితే చాలా మంది ఏసీ,ఫ్యాన్‌ను ఒకేసారి ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ఫ్యాన్ గాలితో ఇల్లంతా వ్యాపిస్తుందని భావిస్తుంటారు. రెండింటిని ఒకేసారి ఉపయోగించడం మంచిదా కాదా ? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం..

ఏసీ, ఫ్యాన్‌ను ఒకేసారి ఉపయోగించడం వల్ల చల్లదనం ప్రతి మూలకు వ్యాపిస్తుంది. దీని కారణంగా గది మొత్తం త్వరగా చల్లబడుతుంది. గది ఉష్ణోగ్రతలు త్వరగా మారుతాయి. ఏసీ కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కరెంట్ ఆదా చేయొచ్చు.

Read More : ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే..!

ఏసీని వినియోగిస్తున్నప్పుడు గదిలో కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఏసీ ఉన్న గదికి కిటీకీలు ఉండకపోవడం ఇంకా మంచిది. దీనివల్ల ఏసీ కూలింగ్ బయటకు వెళ్లదు. గదిలో కూలింగ్ ఎక్కువ సమయం ఉంటుంది. ఏసీ టెంపరేచర్ 24 నుంచి 26 మధ్యలో ఉండాలి. ఫ్యాన్ వేగం తక్కువగా ఉండాలి.

ఏసీ టెంపరేచర్, ఫ్యాన్ తక్కువ పాయింట్లతో ఉపయోగిస్తే.. గది అంతటా చల్లని గాలి త్వరగా విస్తరిస్తుంది. దీంతో కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందనే బాదుండదు. ఏసీ వినియోగం ఖర్చు కూడా తగ్గుతుంది. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

గదిలోని ఏసీ, ఫ్యాన్‌ను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచండి. ఈ రెండింటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఫ్యాన్‌పై దుమ్ము అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేయకుండా ఉపయోగించడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ముక్కు సంబందిత ఇన్ఫెక్షన్లు ఉన్న వారిలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

Read More : సమ్మర్.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి!

ఏసీని ఉపయోగించగడం వల్ల దానిపై ఎప్పుడు తేమ ఉంటుంది. ఈ తేమపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏసీ గదిలో ఎక్కువ సమయం ఉండటం కూడా ఆరోగ్యకరమైన అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. లేదంటే దానిపై ఉండే దుమ్ము రేణువులు గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఫ్యాన్, ఏసీని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఇంట్లో ఫ్యాన్, ఏసీ ఉపయోగించేప్పుడు ఈ నియమాలు కచ్చితంగా పాటించండి.

Disclaimer : ఈ కథనాన్ని పలు హెల్త్ జర్నల్స్ ఆధారంగా, నిపుణుల సూచనల మేరకు మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News