BigTV English

Actor Lena Married Prasanth Nair: గగన్‌యాన్‌ వ్యోమగామి నా భర్తే.. మలయాళ నటి లీనా వెల్లడి..

Actor Lena Married Prasanth Nair: గగన్‌యాన్‌ వ్యోమగామి నా భర్తే.. మలయాళ నటి లీనా వెల్లడి..

 


Actor Lena, Prasanth Nair as her Husband

Actor Lena, Prasanth Nair as her Husband: భారత్‌ తలపెట్టిన ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన నలుగురు పేర్ల ప్రధాని ఫిబ్రవరి 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకరు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌. మలయాళ నటి లీనా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గగన్‌యాన్‌ వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ను వివాహం చేసుకునట్లు తెలిపింది.


గ్రూప్ కెప్టెన్ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో టెస్ట్ పైలట్. లీనా ప్రశాంత్‌ల పెళ్లి 2024 జనవరి 17న జరిగింది. గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరిగా గ్రూప్ కెప్టెన్ నాయర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న కొన్ని గంటల్లోనే లీనా తనను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.

Read More: ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షురూ.. వీడియో షేర్ చేసిన మంచు విష్ణు

“కొన్ని కారణాల చేత రహస్యంగా ఉంచాల్సి వచ్చిన ఓ విషయం చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం రాదు. ప్రశాంత్‌ను నేను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాం. అన్ని సంప్రదాయలతో, కొద్ది మంది అతిథుల మధ్య మా పెళ్లి జరిగింది” అని ఆమె రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో నెన్మారా ప్రాంతానికి చెందిన వారు. ప్రధాని వ్యోమగాముల పేర్లల్లో నాయర్‌ పేరు వెల్లడించడంతో నెన్మారా వాసులు ఆనందంలో మునిగిపోయారు. మిగిలిన ముగ్గురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్లు అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా.

లీనా ఐదు భాషలలో దాదాపు 175 చిత్రాలలో నటించి మెప్పించింది. ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. 25 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో, ఆమె స్నేహ, మలయోగం, షైతాన్ లాంటి కొన్ని టీవీ షోల్లో సందడి చేసింది.

Tags

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×