BigTV English

Ambani’s son’s wedding: అంబానీ కొడుకు పెళ్లి వంటకాల ఒక్కో ప్లేట్ ఎంతో తెలుసా?

Ambani’s son’s wedding: అంబానీ కొడుకు పెళ్లి వంటకాల ఒక్కో ప్లేట్ ఎంతో తెలుసా?

Do you know how much each plate is in Ambani's son's wedding


Do you know how much each plate is in Ambani’s son’s wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అపర కుబేరుడు మాత్రమే కాదు.కలియుగ కుబేరుడు కూడా. తన వద్ద ఎంత సంపద ఉన్నా..దాన్ని ఇంకాస్త పెంచుకునేందుకు ఆయన ఎప్పుడు కొత్త కొత్త ఐడియాలతో తన కంపెనీలను పరుగులు పెట్టించడంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు.ఇక తన కొడుకులు, కోడళ్లు చేతికి అంది వచ్చాక అంబానీ జోరు మరింత పెరిగిపోయింది. ఇండియాలో నివసించే ప్రతి వ్యక్తి అంబానీకి ఇండైరెక్ట్ గా ఏదో ఒక రూపంలో డబ్బులు చెల్లిస్తున్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు మరి.. ఎందుకంటే అంతటి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. మరి అంతటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అంతటి అంబానీ కొడుకు పెళ్లి అంటే ఎలా ఉంటుంది. ఆకాశం అంతా పందిరి, భూదేవి అంతా అరుగు అనే సామెత గుర్తుందిగా..ఆ సామెతను సైతం మూలకు నెట్టే రేంజ్ లో ఉండబోతోంది తన కొడుకు పెళ్లి. మరి ఈ పెళ్లికి దేశంలోని అతిరథ మహారథులు,సెలబ్రెటీలు, దేశ ముఖ్య రాజకీయ నేతలతో పాటు ఇతర దేశ ప్రముఖులు సైతం ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు.

Read More: రాజీవ్‌ హత్య కేసు దోషి శాంతన్ గుండెపోటుతో మృతి.. శ్రీలంకకు మృతదేహం తరలింపు!


మరి ఇంతమంది ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకల్లో వంటలు ఏ రేంజ్లో ఉండాలి. నోరూరించే వంటకాలు మినిమం ఉండాలి కదా. ఊహించుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. హా అది. ఆ ఊహలకు తగ్గట్టుగానే ఏ మాత్రం తగ్గకుండా వంటకాల విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు మాట్లాడుకునేలా చేసేందుకు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పెద్ద ప్లాన్ వేశారట అంబానీ. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి నిజానికి జులై 12న జరగాలి. కానీ.. మార్చి 1,2,3న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ తమ జీవితాల్లోకి వస్తున్న ఆనందంలో ముందుగా చేస్తున్న పెళ్లి తంతు ఇదంతా. దీని కోసం అంబానీ 100 కాదు, 200 కాదు.. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. ఇందుకోసం దేశం నలువైపుల నుండి స్పెషల్ గా 25 నుండి 30 మంది బెస్ట్ షెఫ్ లను నియమించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో టీమ్ ని అలాట్ చేయనున్నారట. మరి అంబానీ అంటే అంతమంది ఉండాల్సిందే కదా అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు.

Read More:హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం రాజీనామా..!

ఇక ఈ వేడుకల్లో బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాల వంటకాలు సిద్దం చేయిస్తున్నారు. ఇక లంచ్ కోసం 250 రకాలు, నైట్ డిన్నర్ కోసం మరో 250 రకాల వంటకాలు మెనూలో ఉండనున్నాయని సమాచారం. మొత్తం 3 రోజుల పాటు హైలెట్ గా నిలిచేలా ఇలా రెడీ చేయిస్తున్నారట. ఇండియన్ , ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, స్పానిష్, జపనీస్, ,చైనీస్, అంటూ ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ఓవరాల్ గా ఒక్క రోజుకి ఒక మనిషి భోజనం ఖరీదు కనీసం 15 వేల వరకు ఉండబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఫ్రీ వెడ్డింగ్ సంబరాలకే ఇంత ఖర్చంటే.. ఇక పెళ్లికి ఏ రేంజ్లో ఖర్చు పెడతారో అనే క్యాలిక్యులేషన్లు స్టార్ట్ మొదలయ్యాయి.

 

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×